NTV Telugu Site icon

Tata Punch EV: టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ బుకింగ్స్ షురూ..

Tata Punch

Tata Punch

Tata Motors: భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక దాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రముఖ ఆటో కంపెనీ టాటా మోటార్స్ దాని ప్రముఖ కారు టాటా పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సరికొత్త ఫీచర్లతో కూడిన ఈ ఎలక్ట్రిక్ కారును కంపెనీ మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 600 కిలో మీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

Read Also: Sandeep Reddy Vanga: ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు నా మొదటి ఛాయిస్ అతడే.. కానీ కుదరలేదు!

అయితే, టాటా పంచ్ లాంచ్‌తో పాటు, కంపెనీ టాటా పంచ్ ఈవీ బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. కంపెనీ ప్రారంభించిన సైట్ acti.ev ద్వారా కస్టమర్‌లు టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. అయితే, 21 వేల టోకెన్ మనీ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు అని పేర్కొనింది. ఈ టోకెన్ డబ్బు కారు డెలివరీ సమయంలో కారు ధరకు జగ చేయబడుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం, టాటా పంచ్ ఈవీ ధర గురించి కంపెనీ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు.

Read Also: Supreme Court : నేతాజీ అమరుడు.. కోర్టు తీర్పు ద్వారా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు: ఎస్సీ

ఇక, ఈ ఎలక్ట్రిక్ కారు (టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్) వివిధ బ్యాటరీ ప్యాక్‌లతో అనేక మోడల్‌లలో వచ్చే అవకాశం ఉంది. దీని పరిధి 300 నుంచి 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. టాటా కంపెనీ తెలిపిన వివకాల ప్రకారం.. acti.ev AC ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 7.2kW నుంచి 11kW ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో పాటు 150 kW వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 10 నిమిషాల్లో 100 కిలో మీటర్ల వేగంతో వేళ్తుంది. టాటా మోటార్స్ గురుగ్రామ్‌లో రెండు ఈవీ- ప్రత్యేకమైన షోరూమ్‌లను తెరిచిన కొద్ది రోజుల తర్వాత పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్ ఆవిష్కరించబడింది. దేశీయ వాహన తయారీ సంస్థ రాబోయే 12 నుంచి 18 నెలల్లో ప్రధాన, ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్త ఈవీ షోరూమ్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది.