NTV Telugu Site icon

TATA Motors: జూలై 1 నుండి పెరగనున్న టాటా మోటార్స్ ధరలు.. కారణమేంటంటే..?

Tata

Tata

టాటా గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్.. తన కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. తన వాణిజ్య వాహనాల ధరలను జూలై 1 నుంచి 2 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఈ మేరకు అన్ని మోడళ్లు, వేరియంట్ల ధరలను పెంచాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది. ఇది మొత్తం వాణిజ్య వాహనాల శ్రేణికి వర్తిస్తుందని.. మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతాయని కంపెనీ పేర్కొంది.

Read Also: DCP Vineet : మియాపూర్‌ భూ వివాదం.. 21 మంది అరెస్ట్

టాటా మోటార్స్ భారతదేశంలో వాణిజ్య వాహనాలలో అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే.. 150 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్‌లో టాటా మోటార్స్ కీలక సంస్థగా ఉంది. ఈ కంపెనీ గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. ఈ కంపెనీ టర్నోవర్ 44 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతీయ వాణిజ్య వాహనాల సెక్టార్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది.ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో మొదటి మూడు స్థానాల్లో ఉంది. ముడి సరుకుల ధరలు పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని కంపెనీ పేర్కొంది. కాగా.. ఈ సంవత్సరం ప్రారంభంలో టాటా మోటార్స్ లిమిటెడ్, ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల కారణంగా 2024 ఏప్రిల్ 1 నుండి ధరలను రెండు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

Read Also: China Rains: చైనాలో భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ పొడిగింపు

టాటా మోటార్స్ దేశంలోని ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ. ఇది ట్రక్కులు, బస్సులు మరియు ఇతర వాణిజ్య వాహనాలను తయారు చేస్తుంది. ఈ ఏడాది వాణిజ్య వాహనాల ధరలను టాటా మోటార్స్ పెంచడం ఇది మూడోసారి. ఇంతకు ముందు జనవరి 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలను 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆరు నెలల్లోనే మూడోసారి మరో 2 శాతం ధరలు పెంచుతోంది. అంటే మొత్తంగా ఈ ఏడాదిలోనే టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలు ఏకంగా 7 శాతం మేర పెరిగాయి.