Site icon NTV Telugu

వైభవ్ సూర్యవంశీకి Tata Motors స్పెషల్ గిఫ్ట్.. Tata Curvv SUV కారు బహుకరణ..!

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Tata Curvv SUV: బీహార్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ముఖ్యంగా IPL 2025 సీజన్‌ లో అత్యధిక స్ట్రైక్‌రేట్ నమోదు చేసి “కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్” అవార్డును గెలుచుకున్నాడు. దీనితో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ అతనికి ప్రత్యేక బహుమతిగా కొత్త టాటా కర్వ్ SUV కారును అందించింది.

Healthy Breakfast Recipes: డైట్ చేసేవారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. చుక్క నూనె లేకుండా ఆవిరి కుడుమును ఇలా సింపుల్‌గా చేసుకోండి!

వైభవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం అనంతరం టాటా కర్వ్ కారును అధికారికంగా స్వీకరించాడు. ఈ సందర్భంగా వైభవ్ ఆనందం వ్యక్తం చేశాడు. టాటా కర్వ్ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 9.66 లక్షల నుంచి ప్రారంభమై రూ. 18.85 లక్షల వరకు ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాటా కర్వ్ EV ధరలు రూ. 17.49 లక్షల నుంచి రూ. 22.24 లక్షల వరకు ఉంటాయి. ఈ SUV స్మార్ట్, ప్యూర్+, క్రియేటివ్, అకంప్లిషెడ్ వంటి పలు వేరియంట్లలో లభిస్తుంది.

Tollywood Excusive: సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్లకు నేము, ఫేము.. మరి ప్లాప్ అయితే!

టాటా కర్వ్‌లో 1.2 లీటర్ రేవోట్రాన్ పెట్రోల్, 1.2 లీటర్ హైపీరియన్ GDI టర్బో పెట్రోల్, 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ మోడల్‌లో 45 kWh, 55 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా మరియు లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.

Exit mobile version