Tata Altroz 2025: మరింత ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో విడుదల కాబోతున్న టాటా అల్ట్రోస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Altroz 2025: టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో తన ప్రతిష్టాత్మక మోడల్ అయిన టాటా అల్ట్రోస్ను 2025 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో విడుదల చేయబోతుంది. మే 22న మార్కెట్లోకి రానున్న ఈ కొత్త వెర్షన్‌కి 2020లో వచ్చిన తర్వాత ఇదే మొదటి పెద్ద అప్డేట్. కొత్త డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్ లేఅవుట్లో కీలక మార్పులు చేపట్టారు. టాటా మోటార్స్ డిజైన్ తత్వానికి అనుగుణంగా ఈ మార్పులు జరిగాయి. టాటా అల్ట్రోస్ మోడల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంజిన్ వేరియంట్లే కొనసాగనున్నాయి. ఇందులో 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, అదే బేస్‌పై టర్బోచార్జ్డ్ వెర్షన్, 1.2 లీటర్ CNG ఆప్షన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లను అందించనున్నారు. ఈ డీజిల్ వేరియంట్ భారతీయ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఏకైకంగా ఉండటం విశేషం. మంచి మైలేజ్ కోరుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్.
Read Also: OnePlus: రెండు కొత్త ఫోన్స్, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ను లాంచ్ కు సిద్దమైన వన్‌ప్లస్..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
టాటా మోటార్స్ ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకాంప్లిష్డ్ S, అకాంప్లిష్డ్+ S ఐదు ట్రిమ్‌లలో విడుదల చేయనుంది. ప్రతి వేరియంట్ భిన్నమైన కస్టమర్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీ, కంఫర్ట్ పరంగా రూపొందించబడింది. బేస్ మోడల్ అయిన ‘స్మార్ట్’ వేరియంట్ అవసరమైన సేఫ్టీ, డిజైన్ అంశాలపై దృష్టి సారిస్తుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్ లాంప్స్ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.
స్మార్ట్ మోడల్ మీద ఆధారపడి ప్యూర్ ట్రిమ్ మరింత అధునాతన ఫీచర్లను జోడిస్తుంది. ఇందులో 7-ఇంచ్ హార్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫొటైన్మెంట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, మెరుగైన LED హెడ్‌ల్యాంప్స్, రియర్ వ్యూ కెమెరా, ఆటో ఫోల్డ్ ORVMలు, వాయిస్ అసిస్టెంట్ తో సన్‌రూఫ్ వంటి ఎంచుకునే ఫీచర్లు ఉన్నాయి. అలాగే క్రియేటివ్ వేరియంట్ లో టెక్నాలజీ, స్టైలింగ్ పరంగా వినియోగదారులకు ప్రీమియం అనుభవం అందిస్తుంది. ఇందులో 360 డిగ్రీ HD కెమెరా, 10.25-ఇంచ్ ఇన్ఫొటైన్మెంట్ స్క్రీన్, లూమినేట్ LED హెడ్‌ల్యాంప్స్, LED DRLs, పుష్ బటన్ స్టార్ట్, గెలాక్సీ అంబియంట్ లైటింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
Read Also: MLC Kavitha: ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్.. నోటీసులపై స్పందించిన కవిత..!
ఇక అకాంప్లిష్డ్ S వేరియంట్ లో మరింత ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఇందులో డ్రాగ్ కట్ R16 అలాయ్ వీల్స్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED ఫాగ్ ల్యాంప్స్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్లెస్ మొబైల్ చార్జర్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ రూఫ్ ఎంపిక ఉన్నాయి. ఇక అకాంప్లిష్డ్+ S వేరియంట్ అన్నిటికన్నా టాప్ వేరియంట్. ఈ అకాంప్లిష్డ్+ S లో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అధునాతన డిస్ప్లేలు, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, నావిగేషన్‌తో కూడిన 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లైండ్ స్పాట్ మానిటర్, AudioWorX కస్టమైజేబుల్ ఆడియో మోడ్లు, ఎయిర్ ప్యూరిఫైర్, SOS కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక మే 22న లాంచ్ అయ్యే ఈ కార్ ధరలు, ట్రిమ్ ఆధారిత ఫీచర్లు అధికారికంగా త్వరలో వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!