Site icon NTV Telugu

Tarun Chugh : కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు

Tarun Chug

Tarun Chug

వరంగల్ లో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ పర్యటించారు. ఈ సందర్భంగా పోచమ్మ మైదాన్ సెంటర్ లోని రాణిరుద్రమ దేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తరుణ్ చుగ్, బీజేపీ నేతలు. అనంతరం లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి కోర్ కమిటీ సభ్యులతో తరుణ్ చుగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పై మీద ఈడి విచారణ చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. లిక్కర్ స్కాంలో విచారణ కోసం పిలిస్తే ఆ విచారణ సంస్థలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుందని, మోసం చేసిన వాళ్లను ప్రశ్నిస్తే తప్పుదారి పట్టించడంలో కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Parliament Sessions: రేపటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. వ్యూహాస్త్రాలు సిద్ధం

వరంగల్ లో రాణిరుద్రమాదేవి ఆశీస్సులు తీసుకోవటం సంతోషంగా ఉందని, స్మార్ట్ సిటీ కోసం కేంద్రం నిధులిస్తుంటే.. కేసీఆర్ సర్కారు నిధులను పక్కదారి పట్టిస్తోందన్నారు. కేసీఆర్ సర్కారు తెలంగాణను లూటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కాదు.. అలీబాబా నలభై దొంగల సర్కార్ అంటూ ఆయన విమర్శించారు. దోచేయ్..దాచెయ్ అన్నట్లుగా ఉంది కేసీఆర్ పాలన అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో తోలుబొమ్మలా మారిందని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బైబై చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు తరుణ్‌ చుగ్‌. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించబోతున్నారని ఆయన అన్నారు.

Also Read : Revanth Reddy : కేసీఆర్ పాలనలో తెలంగాణలో మద్యం ఆదాయం పెరిగింది

Exit mobile version