NTV Telugu Site icon

Tarun Chugh : లిక్కర్ స్కామ్‌లో వందల కోట్ల అవినీతి.. కవిత తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే

Tarun Chugh

Tarun Chugh

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్‌లో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆయన అన్నారు. సోనియా గాంధీ, కేసీఆర్ ఎవరైనా దర్యాప్తు సంస్థలకు సమానమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధికారులకు తప్పకుండా సమాధానం చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

Also Read : Swati Maliwal : మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు.. మహిళ కమిషన్‌ చీఫ్‌ సంచలనం

కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని తరుణ్ చుగ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర మహిళా కమిషన్ బండి సంజయ్‌పై వ్యాఖ్యలపై సీరియస్ అయ్యింది. మహిళా కమిషన్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారణకు డీజీపీని ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని బండి సంజయ్ ను మహిళా కమిషన్ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. అయితే మరోవైపు.. ఎమ్మెల్సీ క‌విత‌పై బండి సంజ‌య్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాంతో ర‌గిలిపోతున్నాయి.. ఢిల్లీ, తెలంగాణ‌లోనూ బండిపై నిర‌స‌న‌లు కొనసాగుతున్నాయి.

Also Read : Natu Natu Song: మన “నాటు నాటు…” పాటకు ఆస్కార్ వచ్చేసినట్టే!?