NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీని అక్కడే టార్గెట్‌ చేయండి.. ఆస్ట్రేలియా బౌలర్లకు హీలీ సూచన!

Virat Kohli Test

Virat Kohli Test

ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మరో రెండు రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభం కానుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రోఫీలో భారత జట్టుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యంత కీలకం కాబోతున్నాడు. న్యూజీలాండ్ సిరీస్‌లో విఫలమయినా.. ఆసీస్ అంటే మాత్రం విరాట్ రెచ్చిపోతాడు. అందుకే ఆస్ట్రేలియా దృష్టంతా కోహ్లీపైనే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీని అడ్డుకునేందుకు ఆసీస్ బౌలర్లకు ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్‌ ఇయాన్‌ హీలీ కీలక సూచనలు చేశాడు. కింగ్ ఫ్రంట్‌ ప్యాడ్లను టార్గెట్‌ చేయాలని చెప్పాడు.

సెన్ రేడియోతో ఇయాన్‌ హీలీ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా పేసర్లు విరాట్ కోహ్లీకి ఎలా బౌలింగ్ చేస్తారన్నది చూడాలి. విరాట్ ఫ్రంట్‌ ప్యాడ్లను టార్గెట్‌ చేయాలి. ప్రతి బంతికీ అలా చేస్తే.. అతడు అలవాటు పడతాడు. ఎప్పుడో ఒకసారి ప్యాడ్లను టార్గెట్‌ చేస్తూ బంతులేస్తే ఫలితం ఉంటుంది. ఆ వ్యూహం ఫలించకపోతే.. అప్పుడు దేహాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. కుడి భుజంకు బంతులేయాలి. కోహ్లీని గాల్లో ఎగిరేలా చేయాలి. బంతి నుంచి తప్పించుకోవడానికి కిందికి, వెనక్కి వంగేలా చేయాలి. అతడి కోసం ప్రత్యేకంగా షార్ట్‌ లెగ్‌లో ఫీల్డర్‌ను ఉంచాలి’ అని చెప్పాడు.

Also Read: AUS vs IND: ఫైర్‌ లేదు.. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వద్దు!

విరాట్ కోహ్లీతో ఎప్పుడూ ఘర్షణ పడొద్దని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ ఆ టీమ్ ఆటగాళ్లకు సూచించాడు. ‘విరాట్ కోహ్లీ గురించి ఓ విషయం నాకు స్పష్టంగా తెలుసు. అతడితో ఎప్పుడూ ఘర్షణ పడొద్దు. ఎంత రెచ్చగొడితే అంత తీవ్రతతో, అంత బాగా ఆడతాడు. అతడిలో నిత్యం జ్వాల రగులుతూ ఉంటుంది. ప్రతి బంతినీ తీవ్రతతో ఆడతాడు. అయితే ఇటీవల కాలంలో కోహ్లీలో జ్వాల కాస్త తగ్గింది. ఏ ప్లేయర్ అయినా ఆటలో అదే తీవ్రతను ప్రతి నిమిషమూ కొనసాగించడం కష్టం. ఈ విషయంలో ఆస్ట్రేలియా చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని వాట్సన్‌ సూచించాడు.