NTV Telugu Site icon

Tarakaratna Daughter: బాలయ్యను చూసి పరిగెత్తుకెళ్లి హత్తుకున్న తారకరత్న కూతురు

Balayya

Balayya

Tarakaratna Daughter: నంద‌మూరి బాల‌కృష్ణపై తారకరత్నకు అంతులేని అభిమానం.బాలయ్యను తారకరత్న ఆప్యాయంగా బాల బాబాయ్ అంటూ పిలుస్తుండేవాడు. బాలయ్య సిగ్నేచర్ ను తారకరత్న టాటుగా వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పుడు బాలయ్యే దగ్గరుండి అంతా తానై చూసుకున్నారు.. బెంగుళూరు నారాయ‌ణ హృద‌యాల‌య‌ డాక్టర్స్ తో మాట్లాడి ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ కూడా ఇప్పించారు. తాను ఎక్కడున్నా ప్రతి సోమవారం బెంగళూరు వెళ్లి తారకరత్న పరిస్థితి గమనించేవారు. కానీ శనివారం తారకరత్న చనిపోయిన తర్వాత.. ‘బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Tarakaratna Family: తాత అంటే ఇష్టం.. ఆయన పేరు కలిసొచ్చేలా బిడ్డలకు పేర్లు

తారకరత్న మరణవార్త తెలియగానే బాలయ్య అన్న మొదటి మాట ఇది. తారకరత్న ప్రాణాన్ని నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశారు బాలకృష్ణ. కానీ అవేవీ ఫలించలేదు. అయితే ఉదయం నుంచి తారకరత్న పెద్ద కూతురు.. నిషిక తండ్రి భౌతిక కాయం వద్ద నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అయితే బాలయ్య రాగానే వెంటనే వెళ్లి ఆయన్ను కౌగిలించుకున్న తీరు నిజంగా హృదయాన్ని కదిలించింది. ఇన్నాళ్లూ తారకరత్న భార్యబిడ్డలకు ధైర్యాన్ని నూరిపోశారు బాలయ్య. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు.. వారికి తోడుగా ఉన్నారు. కష్ట సమయంలో తోడుగా ఉండి వారికి ధైర్యాన్ని నూరిపోశారు. అందుకే తాత కనిపించగానే వెళ్లి కౌగిలించుకుంది నిషిక. ఈ దృశ్యం చూపరులను సైతం కంటతడి పెట్టిస్తోంది.

Show comments