Site icon NTV Telugu

Tantra Movie: పిల్ల‌బ‌చ్చాలు రావోద్దు.. ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల ‘తంత్ర’ పోస్టర్!

Tantra Movie

Tantra Movie

Ananya Nagalla’s Tantra Movie Release on March 15: మల్లేశం, వకీల్‌సాబ్‌ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ‘అనన్య నాగళ్ల’. ఇప్పటివరకు గ్లామర్ క్యారెక్ట‌ర్స్ చేసిన అనన్య.. హార‌ర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘తంత్ర’. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ ప్రొడక్షన్‌పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే తంత్ర నుంచి రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ చిత్ర యూనిట్ ప్రకటించింది.

తంత్ర సినిమా మార్చి 15న రిలీజ్ అవనుంది. ఈ విషయాన్ని మేకర్స్ సరికొత్తగా ప్రకటించారు. ‘మా సినిమాకి పిల్లబచ్చాలు రావోద్దు. ఎందుకంటే మాది ‘A’ సర్టిఫికెట్ సినిమా’ అని చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేసింది. తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్.. సినిమాకి చిన్నపిల్లలు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా సినిమాలో కనిపించనున్నారు.

Also Read: IND vs ENG: నిప్పులు చెరిగిన ఆకాశ్‌ దీప్‌.. ఐదు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్!

అనన్య నాగళ్లకి జోడీగా దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి నటిస్తున్నాడు. మర్యాదరామన్న ఫేం సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ఈ హార్డ్‌హిట్టింగ్ హర్రర్ డ్రామాలో కీలక పాత్రలు చేస్తున్నారు. మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చిన దర్శకుడు వాల్ట్‌డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి.. సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని ‘తంత్ర’తో సాధించాడు.

Exit mobile version