IND vs ENG: నిప్పులు చెరిగిన ఆకాశ్ దీప్.. ఐదు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akash Deep Takes 3 Wickets in IND vs ENG 4th Test at Lunch: ఇంగ్లండ్‌తో రాంచీలో ఆరంభమైన నాలుగో టెస్టులో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ శుభారంభం అందుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను పెవిలియన్ చేర్చాడు. అద్భుతమైన బౌలింగ్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు. బెన్ డకెట్ (11), ఒలీ పోప్ (0), జాక్ క్రాలే (42) ఔట్ చేశాడు. ఆకాశ్ దెబ్బకు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్స్ కోల్పోయి 112 పరుగులు చేసింది. క్రీజ్‌లో బెన్ ఫోక్స్ (2), జో రూట్ (16 ) ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఆరంభించగా.. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశ్ దీప్‌కు బంతినిచ్చాడు. తన తొలి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆకాశ్.. రెండో ఓవర్లో జాక్ క్రాలే క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అది నోబాల్‌గా తేలడంతో.. ఆకాశ్‌కు నిరాశ తప్పలేదు. ఓవైపు సిరాజ్ భారీగా పరుగులు ఇస్తున్నా.. ఆకాశ్ తన పేస్ పవర్ ఏంటో ఇంగ్లండ్ బ్యాటర్లకు రుచిచూపించాడు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో... పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
Also Read: Akash Deep: ఆకాష్ దీప్‌ను వెంటాడిన దురదృష్టం.. క్లీన్ బౌల్డ్ చేసినా దక్కని వికెట్! వీడియో వైరల్
ఆకాశ్ దీప్ పదో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 10వ ఓవర్ రెండో బంతికి బెన్ డకెట్‌ను అవుట్ చేసిన ఆకాశ్.. నాలుగో బంతికి ఒలీ పోప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లోనే జాక్ క్రాలే (42)ను బౌల్డ్ చేశాడు. దాంతో కీలక మూడు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. 22వ ఓవర్‌లో జానీ బెయిర్‌స్టో (38)ను ఆర్ అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక లంచ్‌కు ముందు చివరి ఓవర్లో కెప్టెన్ బెన్ స్టోక్స్ (3)ను ఆర్ జడేజా ఔట్ చేశాడు. దాంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ 112/5తో నిలిచింది.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో… పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!