NTV Telugu Site icon

Taneti Vanitha : పవన్ అవగాహనారాహిత్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు

Taneti Vanitha On Dalit Att

Taneti Vanitha On Dalit Att

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల వాలంటీర్ల వ్యవస్థ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీతో హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పవన్ వాలంటీర్స్ ని బ్లేమ్ చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో వాలంటీర్స్ గా అత్యధికంగా మహిళలే పనిచేస్తున్నారని, అసలు కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు ఎందుకు సమాచారం ఇస్తారన్నారు తానేటి వనిత. కేంద్ర నిఘా వర్గాలు ఇలాంటి ఇష్యూస్ ఎవరికి సమాచారమిస్తారో కూడా పవన్ కు తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండబట్టే ప్రభుత్వం పరువునష్టం దావా క్రింద కోర్టుకు వెళ్తుందని, పరువు నష్టం దావా వేసినప్పుడు జైలుకు వెళ్తారో లేదో కూడా తెలియని పరిస్దితిలో వారున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

Also Read : Baby Movie Collections: వర్షంలోనూ ఆగని వసూళ్లు.. ఫస్ట్ వీక్ ‘బేబి’ కలెక్షన్స్ ఎంతంటే?

పవన్ అవగాహనారాహిత్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తానేటి వనిత మండిపడ్డారు. చంద్రబాబు ట్రైనింగ్, రామోజీ స్క్రిప్ట్ తో పవన్ ఇది సినీ ఫీల్డ్ అనుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని ఆమె విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. సినీ ఫీల్డ్ కి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని, పబ్లిక్ నుండి తెలుసుకున్న సమస్యల పట్ల స్పందించాలే కానీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఇలాగే ఉంటుందని, చంద్రబాబు, లోకేష్, పవన్ రాష్ట్రంలో చేస్తున్న పాదయాత్రలు, బస్సు యాత్రలను ప్రజలు పట్టించుకోక పోవటం వల్లే ప్రస్టేషన్ లోనై ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

Also Read : New Delhi: ఇండియా శ్రీలంక మధ్య ఆర్థిక భాగస్వామ్యం.. విజన్ డాక్యుమెంట్‌పై ఆమోదం