వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ అధికారుల చెకింగ్ వాహనంలో చోరీ జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన టీఎస్ఆర్టీసీకి చెందిన చెకింగ్ అధికారులు వికారాబాద్ జిల్లాలోని తాండురులో నిన్న (శుక్రవారం) రాత్రి 9.30 గంటలకు డిపోలో చెకింగ్ చేసినట్లు పేర్కొన్నారు. చెకింగ్ అనంతరం రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేసేందుకు డిపో పక్కనే ఉన్న హోటల్ కు వెళ్లారు. అయితే, అధికారులు భోజనం చేసేందుకు వెళ్లడం చూసిన దుండగులు పార్కింగ్ చేసిన వాహనంలో నుంచి ఓ బ్యాగ్ ను కొట్టేసినట్లు గుర్తించి.. వెంటనే ఆర్టీసీ అధికారులు తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Sithara : సినిమాల్లోకి సితార ఎంట్రీ.. అన్ని చోట్లా కుళ్ళు ఉందంటూ నమ్రత కామెంట్స్
ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము ఖమ్మం జిల్లాకు చెందిన చెకింగ్ టీమ్ శుక్రవారం రాత్రి తాండురులో ఆర్టీసీ బస్సులను తనిఖీలు చేసేందుకు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే. రాత్రి 9.30 గంటలకు చెకింగ్ చేసిన తర్వాత.. ఆకలి వేయడంతో పక్కనే ఉన్న హోటల్ కి వెళ్లి అక్కడ భోజనం చేసేందుకు తమ వెహికిల్ ను పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్లినట్లు తెలిపారు.. అయితే.. చెకింగ్ వెహికిల్ సైడ్ డోర్ అద్దాన్ని కిందికి దించి వాహనంలో ఉన్న బ్యాగు దొంగిలించినట్లు వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, ఆ బ్యాగులో ఆర్టీసీకి సంబంధించిన కొన్ని చెకింగ్ పుస్తకాలతో పాటు, టీటీఐ ఐడీ కార్డ్స్, ఆధార్ కార్డులు ఉన్నట్లు ఖమ్మం జిల్లాకు చెందిన చెకింగ్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.
Read Also: Dadisetti Raja: 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన సముద్రంలో కలిసిపోవడం ఖాయం