Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
Tamilnadu Assembly Election 2026: తమిళనాడు ఓటర్లు చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు.. తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 82.24 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగా.. క్యూలైన్లలో నిల్చున్న వారికి మాత్రమే ఓటు వేయడానికి అనుమతి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధిక పోలింగ్ శాతంగా నిలిచింది.
Read Also: TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
Also Read
- Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
- Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
- Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
తమిళనాడులో మొత్తం 4,71,60,321 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్ 2011 ఎన్నికల్లో 78 శాతంగా నమోదైంది. 2021 ఎన్నికల్లో 73.63 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే, ఈసారి ఆ రికార్డులన్నింటినీ అధిగమిస్తూ ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరు నియోజకవర్గంలో 83.58 శాతం పోలింగ్ నమోదైంది. మాజీ సీఎం పళణిస్వామి పోటీ చేస్తున్న ఎడప్పాడి నియోజకవర్గంలో 89.09 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. నటుడు విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్‌లో 86.72 శాతం పోలింగ్ నమోదైంది. తిరుచిరాపల్లి ఈస్ట్‌లో 79.32 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక, కొంగునాడు ప్రాంత జిల్లాల్లో కూడా రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, నమక్కల్, కరూర్, నీలగిరి, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి తమిళనాడు ఓటర్లు ప్రజాస్వామ్యంపై తమ నిబద్ధతను చాటారు. భారీ ఎత్తున పోలింగ్ జరగడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధిక ఓటింగ్ శాతం ఫలితాలపై ఎలా ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ – పూర్తి వివరాలు
-
Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
-
Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
-
Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
-
Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!