Holiday declared for schools in Tamil Nadu due to Heavy Rains: తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. నాగపట్నంలో అయితే ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుండి జనవరి 8 ఉదయం 5.30 గంటల వరకు 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరైకల్ (12.2 సెం.మీ.), పుదుచ్చేరి (9.6 సెం.మీ.), కడలూరు (9.3 సెం.మీ.), ఎన్నూర్ (9.2 సెం.మీ.)లో భారీ వర్షపాతం నమోదైంది.
కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‌పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. నేడు కూడా తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో చెంగల్ పట్టు, కన్యకూమారి, తిరవళ్ళూరు సహా ఆరు జిల్లాలో నేడు స్కూల్స్‌కు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Also Read: David Warner: నాకో ఆశయం ఉంది.. క్రికెట్ కెరీర్ తర్వాత..!
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలులు తమిళనాడులో కురుస్తున్న వర్షపాతానికి కారణమని ఆర్‌ఎంసిలోని ఏరియా తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పి.సెంతమరై కన్నన్ చెప్పారు. మైచాంగ్ తుఫాను అంత తీవ్రంగా ఇప్పుడు ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని ఆయన అంచనా వేశారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత నాలుగు సంవత్సరాలుగా డిసెంబర్, జనవరి మాసాల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.