David Warner: నాకో ఆశయం ఉంది.. క్రికెట్ కెరీర్ తర్వాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Warner expresses ambition to take up coaching in future: తనకు ఓ ఆశయం ఉందని, క్రికెట్ కెరీర్ తర్వాత కోచ్‌గా పని చేయాలనుకుంటున్నా అని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఐపీఎల్, పీఎస్ఎల్, సీపీఎల్, బిగ్ బాష్ వంటి లీగ్‌లలో వివిధ దేశాల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లు పంచుకుంటుండటంతో.. వచ్చే పదేళ్లలో స్లెడ్జింగ్ పూర్తిగా దూరమవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇకపై ప్లేయర్స్ స్లెడ్జింగ్ కంటే గెలవడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తారని వార్నర్ పేర్కొన్నాడు. టెస్టులు, వన్డేలకు వార్నర్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే టీ20ల్లో మాత్రం అతడు కొనసాగుతున్నాడు.
డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ… ‘నాకో ఆశయం ఉంది. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత కోచ్‌గా పని చేయాలనుకుంటున్నా. ఇందుకోసం ముందుగా నా భార్యతో మాట్లాడాలి. ఎందుకంటే.. ఇంకొంత కాలం ఇంటికి దూరంగా ఉండేందుకు అనుమతి తీసుకోవాలి. ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన కొత్తలో మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల ముఖాల్లోకి నేరుగా చూసేవాడిని. వారు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లయను దెబ్బతీసేవాడిని. ఇకపై అలాంటి స్లెడ్జింగ్ చూస్తారని అనుకోవడం లేదు. వచ్చే 5-10 పదేళ్లలో అంతా మారిపోతుంది. స్లెడ్జింగ్ కంటే మ్యాచ్ గెలవడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తారు’ అని అన్నాడు.
Also Read
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
Also Read: IND vs AUS: బ్యాటర్ల వైఫల్యం.. రెండో టీ20లో భారత్ ఓటమి!
పాకిస్తాన్‌పై తాజాగా డేవిడ్ వార్నర్ కెరీర్‌లో చివరి టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. వార్నర్ 112 టెస్టులో 8,786 రన్స్ చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 335 నాటౌట్. వన్డే క్రికెట్‌కు సైతం వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో చివరగా ఆడాడు. ఆసీస్ తరపున 161 వన్డేలు ఆడిన వార్నర్.. 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 179.
తాజావార్తలు
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?