NTV Telugu Site icon

Atrocious News: బిడ్డ తెల్లగా ఉన్నాడని.. కన్న కొడుకునే గోడకేసి కొట్టిచంపిన తండ్రి

Tamilnadu

Tamilnadu

Atrocious News: అనుమానం పెను భూతమైంది.. అని చాలా సార్లు చదివే ఉంటాం. ఈ సంఘటనలోనూ ఆ అనుమానమే.. ఏడాదైనా నిండని పసి కందు పాలిట యమ పాశమైంది. భార్యపై పెంచుకున్న అనుమానమే… ఆ బాలుడి ఉసురు తీసింది. ముక్కుపచ్చలారని పసికందును కన్నతండ్రే కిరాతకంగా గోడకేసి కొట్టి చంపిన దారుణ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి.. అతి కిరాతకంగా ప్రవర్తించాడు. కనీసం జాలి చూపకుండా ముక్కుపచ్చలారని పసికందుపై ప్రతాపం చూపించాడు. ఇందుకు కారణం తెలిసి.. సభ్య సమాజం తలదించుకుంటోంది.

అసలు ఏం జరిగిందంటే.. చెన్నైకి చెంది రంజిత్‌ కుమార్, కౌసల్య అనే యువతిని ఐదు నెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందే సహజీవనం చేయడం వల్ల గర్భం దాల్చిన రెండు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది కౌసల్య. ఆ పుట్టిన బిడ్డను ఎప్పుడూ తీక్షణంగా చూసేవాడు. ఆ బాలుడిని చూసినప్పుడల్లా అతనికి అనుమానం ఎక్కువ అయింది. కొడుకు తెల్లగా ఉన్నాడని భార్యపై అనుమానం పెంచుకున్నాడు రంజిత్ కుమార్. తాను, తన భార్య నల్లగా ఉండగా.. తమ బిడ్డ మాత్రం తెల్లగా ఎలా జన్మించాడంటూ అనుమానాన్ని పెంచుకుని.. శుక్రవారం భార్యతో రంజిత్ గొడవపడ్డాడు. తీవ్ర ఆవేశానికి గురై మృగంలా మారి రెండు నెలల పసికందును పలుమార్లు గోడకేసి కొట్టి చంపేశాడు.

Read Also: Man Infected By Killer Plant : మొక్కల నుంచి మానవునికి వ్యాధులు

అక్కడక్కడే ఆ రెండు నెలల బాలుడు తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. రంజిత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. సహజీవనం చేద్దామన్న రంజిత్.. ఉన్నతంగా ఆలోచిస్తాడని అనుకుంటే ఇలా చేశాడని అతని భార్య కన్నీటి పర్యంతం అయింది. “అనుమానంతో నన్ను, నా కుమారుడిని నా భర్త తరుచుగా కొడుతూ ఉండేవాడు. ఆ అనుమానంతోనే నా కుమారుడిని హత్య చేశాడు. నా భర్త, నేను చూసేందుకు నల్లగా ఉంటాం. నా కుమారుడు తెల్లగా ఉంటాడు. అలా ఎందుకు పుట్టాడు అని తరచుగా నన్ను హింసించేవాడు. చివరికి నా కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడు” అంటూ.. అతని భార్య కన్నీటిపర్యంతమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments