TN Governor: తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ఇది బయట పడింది. నిజానికి జనవరి రెండో వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండాల్సింది.. కానీ, సీఎం ఎమ్‌కే స్టాలిన్ స్పెయిన్‌లో వరల్డ్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇక, ఇవాళే (ఫిబ్రవరి 12) సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Read Also: Eagle: ఈరోజు నిలబడితే ఈగల్ ని ఆపడం కష్టమే…
అయితే, తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పక్కన పెట్టారు. నేటి ఉదయం 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన ఆయన రెండు నిముషాల్లోనే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ప్రభుత్వం రాసిన ప్రసంగాన్ని చదవనని గవర్నర్ స్పష్టం చేశారు.. ఆ ప్రసంగంలో కొన్ని అభ్యంతరకర, అంగీకారయోగ్యం కాని మాటలు ఉన్నాయని తేల్చి చెప్పుకొచ్చారు. ఇక, గవర్నర్‌కి బదులుగా స్పీకర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదవారు. దీంతో మరోసారి తమిళనాడు అసెంబ్లీలో ఆందోళన అలజడి చెలరేగింది.
Read Also: Assembly Budget Session: తెలంగాణలో సిగరెట్లు, పొగాకు యాడ్స్ నిషేధం..!
ఇక, నా ప్రసంగానికి ముందు జాతీయ గీతం ఆలపించాలని చాలా సార్లు నేను ప్రభుత్వానికి సూచించాను అని గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. కానీ, వాళ్లు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వలేదు.. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో కొన్ని అభ్యంతకరమైన అంశాలున్నాయి.. వాటితో నేను అంగీకరించలేను.. కాబట్టే, ఇంతటితోనే నా ప్రసంగాన్ని ఆపేస్తున్నాను.. ఈ సమావేశాల్లో చర్చలు సానుకూలంగా జరుగుతాయని కోరుతున్నాను అని గవర్నర్ ఆర్ఎన్ రవి తన ప్రసంగంలో వినిపించారు.
#WATCH | At the Tamil Nadu assembly session, Governor RN Ravi says, "My repeated request & advice to show due respect to the national anthem and play it at the beginning & end of the address has been ignored. This address has numerous passages with which I convincingly disagree… pic.twitter.com/BhFLWS09Ws
— ANI (@ANI) February 12, 2024