మీచౌంగ్ తుఫానుతో తమిళనాడు రాష్ట్రం తల్లడిల్లింది. భారీ వర్షాలతో తమిళ ప్రజల విలవిలలాడుతున్నారు. మీచౌంగ్ విపత్తు నుంచి కోలుకుంటుండగానే మరోసారి కుండపోత వాన కురవడంతో దాదాపు సగం రాష్ట్రానికి నరకం చూపించింది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. తూత్తుకుడి, కాయల్‌పట్టివనం, మదురై, విరుదునగరం, తేని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో డ్యామ్‌లు నిండు కుండల్లా మారి నీటి దిగువకు విడుదల చేయడంతో పరిస్థితి మరింతగా విషమించింది.
Read Also: SRH Full Squad: తెలుగు ఆటగాళ్లకు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!
ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో ఇటీవల వరదలు సంభవించిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి 2,000 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకు, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్‌కాసి జిల్లాల్లో తాత్కాలిక పునరావాస పనులు చేపట్టేందుకు ఆర్థిక సాయం చేస్తే.. కొంత ఉపశమనం దోరుకుతుందని ఆయన చెప్పారు.
Read Also: Harish Rao: ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వండి.. స్పీకర్ కు హరీష్ రావు లేఖ
అయితే, వరదల వల్ల సంభవించిన శాశ్వత నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయడానికి సమయం పడుతుంది అని సీఎం స్టాలిన్ చెప్పారు. జీవనోపాధిని అందించడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్ చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజా మౌలిక సదుపాయాలకు మరమ్మత్తుతో పాటు పునరుద్ధరణ పనులను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని ఆయన ప్రధానికి పేర్కొన్నారు. జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ. 2,000 కోట్ల మధ్యంతర సహాయాన్ని అభ్యర్థిస్తున్నామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు.