Harish Rao: తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయాలు ఉండబోతున్నాయనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. సాధారణంగా ప్రారంభ సమావేశాలు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ఉండే సందర్భాలు చాలా తక్కువ. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా తొలి సమావేశాలు వాడివేడిగా సాగాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించాయి. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటకు తీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబితే దేనికైనా సిద్ధమేనని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ తేల్చేసింది. గతాన్ని గుర్తు చేసుకుంటూ గులాబీ పార్టీని నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి యోచిస్తుంటే.. ఆ గతాన్ని తమ బలంగా మార్చుకోవాలని కేసీఆర్ టీమ్ నిర్ణయించుకున్నారు. తొలి భేటీలోనే అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో సాగింది.
Read also: Parliament : పార్లమెంట్ దాడి.. సాగర్ శర్మ డైరీలో ఆధారాలు.. 22 మొబైల్ నంబర్ల విచారణ
అయితే వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పడంతో బీఆర్‌ఎస్ కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. భారత రాష్ట్ర సమితి పార్టీకి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని హరీశ్ రావు లేఖ రాశారు. లేఖలో హరీశ్ రావు ఏం రాశారంటే.. రేపటి నుంచి శాసనసభ సమావేశాల్లో ఆర్థిక, సాగునీరు, విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఒకవేళ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుమతిస్తే. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా మా సంస్కరణను సభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కావున భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షానికి అనుమతి ఇవ్వగలమని కోరుతున్నాము. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని స్పీకర్ కు తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు.
Tamilnadu : తమిళనాడులో వర్ష బీభత్సం.. చిక్కుకున్న 800 మంది కోసం 48గంటలుగా రెస్క్యూ ఆపరేషన్