NTV Telugu Site icon

CM MK Stalin: ప్రధాని మోడీ సహాయంతో నడిచిన తమిళనాడు సీఎం

Cm Help Pm

Cm Help Pm

Tamil Nadu CM MK Stalin Help To PM Modi at Khelo India Youth Games event

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను నిన్న ( శుక్రవారం ) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడ హాజరయ్యారు. అయితే స్టేడియం వేదిక వైపు న‌డుచుకుంటూ వెళ్తున్నప్పుడు సీఎం స్టాలిన్ బ్యాలెన్స్ కోల్పోయారు. దీంతో పక్కనే ఉన్న ప్రధాని మోడీ అది గమనించి ఆయన ఎడమ చేతిని పట్టుకుని ముందుకు నడిపించారు. అయితే, స్టాలిన్ వెనుకాలే ఉన్న ఉద‌య‌నిధి కాస్త కంగారుగా కనిపించాడు. ఆ త‌ర్వాత మోడీ, స్టాలిన్ క్షేమంగా వేదిక‌పైకి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Prabhas: హను సినిమా ఫిక్స్… కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్

అయితే, ఖేలో ఇండియా ఈవెంట్‌ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్ క్రీడలకు భార‌త్ ఆతిథ్యం ఇవ్వాల‌ని తెలిపారు. క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపును అందించడంతో పాటు భారతదేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌కు కేంద్రంగా మార్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నిస్తోందని మోడీ అన్నారు. కాగా, తమిళనాడును దేశ క్రీడా రాజధానిగా మార్చడమే డీఎంకే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఇక, ప్రధాని మోడీ ఇవాళ రెండో రోజు తమిళనాడులో పర్యటిస్తున్నారు.

Show comments