ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేసాడు. కల్కి 2898 AD, ది రాజా సాబ్ సినిమాలు ఫైనల్ షూటింగ్స్ స్టేజ్ లో ఉన్నాయి. ప్రభాస్ ఫ్యూచర్ సినిమాల లిస్టులో స్పిరిట్, సలార్ 2 అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి ఉన్నాయి. స్పిరిట్ కన్నా ముందు సలార్ 2 సెట్స్ పైకి వెళ్తుంది అనే వార్త వినిపిస్తోంది. సలార్ పార్ట్ 1 హిట్ ఇచ్చిన జోష్ లో పార్ట్ 2ని స్టార్ట్ చేయడానికి ప్రభాస్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడని టాక్. ఇక ప్రభాస్ ఈ సినిమాలు మాత్రమే కాకుండా హను రాఘవుడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అనే మాట కూడా ఇండస్ట్రీలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు అని చాలా రోజులుగా టాక్ వినిపిస్తూనే ఉంది కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే మణిరత్నం తర్వాత అంత అందంగా ప్రేమకథని చెప్పే దర్శకుడిగా హను రాఘవపూడి పేరు తెచ్చుకున్నాడు.
సీతారామం తర్వాత హను రాఘవపూడి కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలన్నట్టు… ప్రభాస్‌తో హను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయట. ‘వరల్డ్ వార్ 2’ నేపథ్యంలో జరిగే కథని హను, ప్రభాస్ కోసం రాసాడట. యుద్ధంలో పుట్టే ప్రేమ కథ, యుద్ధ వీరుడి ప్రేమ కథ లాంటి ఎలిమెంట్స్ తో హను కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. సీతారామం సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్… ప్రభాస్-హను రాఘవపూడి సినిమాకి కూడా మ్యూజిక్ ఇవ్వనున్నాను అంటూ స్వయంగా తెలపడంతో ఈ విషయం బయటకి వచ్చింది. గతంలో విశాల్ చంద్రశేఖర్-హను రాఘవపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. అందుకే ఇప్పుడు… ప్రభాస్ సినిమాకు కూడా అతన్నే ఫిక్స్ చేసినట్లు ఉన్నారు.