Bomb Threat Hoax: తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ నివాసంతో పాటు, సినీ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసాలకు ఆదివారం రాత్రి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఈ-మెయిల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కార్యాలయానికి కూడా రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఈ నాలుగు ప్రాంతాలలోనూ భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని ఇంజాంబాక్కంలో ఉన్న నివాసానికి గత వారం కూడా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి బాంబు బెదిరింపు వచ్చింది. తాజాగా మళ్లీ బెదిరింపు రావడంతో పోలీసులు ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నారు.
IPL 2026: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా కుమార సంగక్కర రీ-ఎంట్రీ..!
బెదిరింపు మెయిల్ అందిన వెంటనే పోలీసు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఆ తనిఖీలలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఈ బెదిరింపులన్నీ బూటకం (Hoax) అని అధికారులు ధృవీకరించారు. బెదిరింపు మెయిల్ పంపిన వారి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా గతంలో డీజీపీ కార్యాలయానికి నటుడు అరుణ్ విజయ్ నివాసంలో (ఎక్కట్టుత్తాంగల్) బాంబు పెట్టినట్లు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఆ సమాచారం అందిన వెంటనే పోలీసులు, బాంబు డిస్పోజల్ నిపుణులు సోదా చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో ఈ విధమైన సంఘటనల బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతోంది. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపుల వెనుక ఉన్న ఆకతాయిలను లేదా కుట్రదారులను పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
SS Rajamouli : ఐ బొమ్మ రవి మీ పర్సనల్ డేటా అమ్ముకుంటున్నాడు.