Tamil Movies : ఆ రెండు సినిమాలకు షాక్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగ సందర్బంగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి కార్తి హీరోగా నటించిన జపాన్ సినిమా అలాగే లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ విడుదల అయ్యాయి.. ఈ రెండు సినిమాలు మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.రెండు భాషల్లో పండుగకు రిలీజైన సినిమాల్లో ఇవే భారీ బడ్జెట్ మూవీస్ కావడం విశేషం… జపాన్ సినిమాకు రాజ్ మురుగన్ డైరెక్టర్ కాగా.. జిగర్ తాండ సీక్వెల్‌కు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో రిలీజైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.భారీ నష్టాల దిశగా సాగుతోన్నాయి. కార్తి జపాన్ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 15 కోట్లకుపైగా గ్రాస్, ఏడున్నర కోట్లకు వరకు షేర్ కలెక్షన్స్ ను రాబట్టింది. తెలుగులో ఈ మూవీ ఇప్పటివరకు మూడున్నర కోట్ల వరకు గ్రాస్‌ను, కోటి డెబ్బై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.తొలిరోజు జపాన్ మూవీకి కోటికిపైగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ నెగెటివ్ టాక్ కారణంగా మూడో రోజు వసూళ్లు మరీ దారుణంగా పడిపోయాయి. ఆదివారం రోజు ఈ సినిమా 35 లక్షల వరకు మాత్రమే వసూళ్లను సొంతం చేసుకుంది..
జపాన్ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించింది.అలాగే లారెన్స్, ఎస్‌జేసూర్య హీరోలుగా నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ తెలుగు ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది. మూడు రోజుల్లో ఈ మూవీకి రెండు కోట్ల నలభై లక్షల వరకు గ్రాస్ అలాగే కోటి ఇరవై లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మూడో రోజు ఈ సినిమా యాభై లక్షల వరకు వసూళ్లు దక్కించుకున్నట్లు సమాచారం.. తెలుగులో కార్తి జపాన్ సినిమా కంటే జిగర్ తాండ సినిమాకు ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.జపాన్ నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదల అవ్వగా…జిగర్ తాండ డబుల్ ఎక్స్ ఐదున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల అయింది.రెండు సినిమాల కలెక్షన్స్ చూస్తుంటే తెలుగులో బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Tags
- Japan
- jigarthanda
- tamil movies
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!