సినిమా ఇండస్ట్రీ లో చిన్న స్థాయి హీరో హీరోయిన్ నుండి స్టార్ హీరో హీరోయిన్ ల వరకు అభిమానులు ఉండటం సహజం. కొంతమంది హీరో హీరోయిన్ లకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారికీ ఏకంగా గుడి కట్టి పూజించే భక్తులు కూడా ఉంటారు. వారు తమ ఫేవరెట్ స్టార్ కోసం ఏమైనా చేస్తారు.సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కు వున్న క్రేజ్ ఎవరికీ ఉండదు.కొంతమంది స్టార్ హీరోయిన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు.ఆ విధంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ లలో తమన్నా కూడా ఒకరు. హ్యాపీడేస్ సినిమా తో తనకంటూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. తెలుగులో ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.. తెలుగులో స్టార్ లతో సినిమాలు చేసి ఎంతో పాపులరిటి సంపాందించుకుంది. ఈ భామ తెలుగుతో పాటు తమిళ్ సినిమాలు కూడా చేసింది.
ఇక ఈ అమ్మడు ఇప్పుడు హిందీ సినిమాలను కూడా చేస్తుంది . తాజాగా ఈ భామ నటించిన జీ కర్దా అనే వెబ్ సిరీస్ ఓటీటీ లో విడుదల అయింది.అలాగే లస్ట్ స్టోరీ సిరీస్ అనే మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది. ఇక రెండు వెబ్ సిరీస్ లలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటించింది తమన్నా. ఇదిలా ఉంటే తమన్నాకు లక్షల మంది అభిమానులు ఉన్నారు.తాజాగా ఓ అభిమాని చేసిన పనికి తమన్నాకన్నీరు పెట్టుకుంది.. తాజాగా ముంబై విమానాశ్రయంలో తమన్నా ను ఓ అభిమాని కలిసింది. తమన్నాను కలిసిన ఆ వ్యక్తి వెంటనే ఆమె కాళ్ళు మొక్కాడు.ఓ ఫ్లవర్ బొకే ను ఇచ్చి తన చేతి పై ఉన్న తమన్నా టాటూ ను కూడా చూపించి. ఆమె అంటే ఎంత అభిమానమో తమన్నాకు తెలియజేసాడు.. దాంతో తమన్నా ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది.. వెంటనే అతడిని కౌగిలించుకొని మీ అభిమానానికి థాంక్స్ అండ్ లవ్ యు అని చెప్పింది.