Site icon NTV Telugu

Tamannaah: ఆ వ్యక్తి చాలా డేంజర్.. విజయ్ వర్మతో బ్రేకప్‌పై తమన్నా షాకింగ్ కామెంట్స్..!

Tamannaha

Tamannaha

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితంపై నిరంతరం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మతో ఆమె సాగించిన మూడేళ్ల ప్రేమాయణం, ఆపై జరిగిన బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా తన ప్రేమ, బ్రేకప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

Also Read : Ileana: ఇలియానాపై సౌత్ ఇండస్ట్రీ బ్యాన్? 40 లక్షల అడ్వాన్స్ వివాదం వెనుక అసలు నిజాలివే!

ఇండస్ట్రీలో డెటింగ్ లు.. రిలేషన్షిప్..బ్రెకప్.. కామన్. ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ఇలాంటి వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తున్నే ఉంటుంది. అయితే తాజాగా తమన్నా తన జీవితంలో రెండుసార్లు హృదయం ముక్కలైందని ఎమోషనల్ అయ్యారు.. ‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడే మొదటిసారి ప్రేమలో పడ్డాను. కానీ నా లక్ష్యాల కోసం, కెరీర్ కోసం ఆ బంధాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నాను. కానీ కొన్నాళ్లకే ఆ వ్యక్తి నాకు సరైన జోడీ కాదనిపించింది. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగించడం చాలా ప్రమాదకరమని (Dangerous) గ్రహించి బయటపడ్డాను’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో ఈ ‘డేంజర్ పర్సన్’ అని తమన్నా అన్నది ఎవరిని? విజయ్ వర్మనేనా? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ లో కలిసి నటించిన తమన్నా, విజయ్ వర్మ లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయ్యారు. దీంతో తో తమన్నా భాటియా ప్రేమాయణం సాగిస్తున్నారని బీటౌన్ మీడియా కోడై కూసింది. అప్పటి నుండి ఏ ఈవెంట్ కి వెళ్లిన వీరిద్దరు కలిసి వెల్లడం.. కలిసి షోటో షూట్ లు కూడా చేయడంతో త్వరలో పెళ్లి చేసుకుంటారని అందరూ భావిస్తున్న తరుణంలోనే వీరిద్దరూ విడిపోయారు. తమన్నా పెళ్లికి సిద్ధమవ్వగా, విజయ్ మాత్రం కెరీర్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని బీటౌన్ టాక్. ఏది ఏమైనా, “ప్రేమ కంటే ఆత్మగౌరవం, కెరీర్ ముఖ్యం” అని తమన్నా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Exit mobile version