మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితంపై నిరంతరం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మతో ఆమె సాగించిన మూడేళ్ల ప్రేమాయణం, ఆపై జరిగిన బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా తన ప్రేమ, బ్రేకప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…