పాకిస్థాన్‌తో చర్చలు జరిగే వరకు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా బుధవారం అన్నారు. గత మూడు రోజుల్లో జమ్మూలో జరిగిన మూడు ఉగ్రవాద దాడుల తర్వాత అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫరూక్ అబ్దుల్లా బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. “రెండు దేశాల (భారత్-పాకిస్థాన్) మధ్య అవగాహన ఉంటే తప్ప ఉగ్రవాదం అంతం కాదు. ఉగ్రవాదం కొనసాగుతుందని, దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. బాధాకరమైన విషయం ఏమిటంటే.. అమాయకులు చనిపోతున్నారు… అది దురదృష్టకరం.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Mars: అంగారకుడిపై బిలాలకు యూపీ, బీహార్ పట్టణాల పేర్లు..
మనం మేల్కొని దీనికి పరిష్కారం కనుగొనే వరకు అమాయకులు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సరిహద్దు సమస్యల పరిష్కారంపై భారత్ దృష్టి సారిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. “సంభాషణ” మాత్రమే ముందున్న మార్గమన్నారు. మనం చైనాతో మాట్లాడాలని నిన్న విదేశాంగ మంత్రి స్వయంగా చెప్పారన్నారు. మొదటిసారి పాకిస్తాన్ గురించి కూడా ప్రస్తావించారని తెలిపారు . ఆయన దీనిని ఇలాగే కొనసాగించి పరిష్కారం కనుగొనాలని కోరారు.
READ MORE: RBI: ఆర్బీఐ సంపాదనలో గణనీయమైన పెరుగుదల..పాకిస్తాన్ జీడీపీ కంటే 2.5 రెట్లు ఎక్కువ
కాగా.. వరస ఎన్‌కౌంటర్లతో జమ్మూ కాశ్మీర్ ఉలిక్కిపడింది. రియాసీ బస్సుపై దాడి తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మరో రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆదివారం కత్రా నుంచి శివ్ ఖోరీకి భక్తులను తీసుకెళ్తున్న బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు సమీపంలోని అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.