NTV Telugu Site icon

Talasani Srinivas Yadav: వాళ్లను చూస్తున్నాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి ఉండదు!

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

పార్టీ మారిన వారి పరిస్థితి చూస్తున్నాం అని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి ఉండదు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ చాలా హుషారుగా ఉందని, ఎవరు వార్త రాపించారో వాళ్లనే అడగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా సర్వే చేసిందని, హైదరాబాద్ గ్రామాల్లో సర్వే ప్రాపర్‌గా జరుగలేదన్నారు. 60 లక్షల మంది ఎక్కడ పోయారో లెక్కలు లేవని తలసాని విమర్శించారు. ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవండని, తమ మీద పడి ఏడవడం ఏంటి? అని పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ‘మా ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి ఉండద. పార్టీ మారిన వారి పరిస్థితి మేం చూస్తున్నాం. అప్పటి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మా క్యాడర్ చాలా హుషారుగా ఉంది. ఎవరు వార్త రాపించారో వారినే అడగాలి. మరలా మొత్తం సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కుట్ర పూరితంగా సర్వే చేశారు. హైదరాబాద్ గ్రామాల్లో సర్వే ప్రాపర్‌గా జరుగలేదు. 60 లక్షల మంది ఎక్కడ పోయారో లెక్కలు లేవు’ అని మండిపడ్డారు.

Also Read: Farm House Case: తొల్కట్ట ఫామ్‌హౌస్‌ కేసులో కీలక ట్విస్ట్!

‘ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కలు చూస్తే కూడా.. మిగితా వాళ్ళు ఎక్కడకి పోయారు అనేది క్లారిటీ లేదు. బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయాలి. తీర్మానం చేసి కేంద్రానికి పంపితే లాభం లేదు. జనాభా ప్రాతిపదికన ఫైనాన్స్ కమిషన్ నుంచి కేంద్రం డబ్బులు ఇస్తుంది.1.35 శాతం జనాభా పెరుగుదల ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవండి, మా మీద పడి ఏడవడం ఏంటి?’ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.