NTV Telugu Site icon

Talasani Srinivas Yadav : గద్దర్ మరణం తెలంగాణ సమాజానికే తీరని లోటు

Minister Talasani

Minister Talasani

ప్రజా గాయకుడు గద్దర్ సమాజానికి ఉపయోగపడేటటువంటి గొప్ప వ్యక్తి అని, ప్రజా యుద్ధ నౌక.. ఒక గాయకుడు.. పేరుండి కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఎన్టీవీతో మంత్రి తలసాని మాట్లాడుతూ.. ద్దర్ మరణం తెలంగాణ సమాజానికే తీరని లోటని, తన గానం తో తెలంగాణ ప్రజానీకానికి చైతన్యం కలిగించాడని ఆయన వ్యాఖ్యానించారు. తన వేషధారణ చూస్తేనే అర్థమవుతుంది.. ఎంత నిరాడంబరంగా జీవించాడోనని, కొందరు ఇక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు.. మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.

Also Read :Game Changer : ఆ పాట కోసం భారీగా ప్లాన్ చేస్తున్న దర్శకుడు శంకర్..?

గద్దర్ ఒక పార్టీ నేత కాదు.. ప్రజా నాయకుడు.. తెలంగాణ గొంతుక.. పద్ధతి మానుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్ కూడా కీలక వ్యక్తి అని మంత్రి తలసాని అన్నారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారన్నారు. దీన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారని, గొప్ప వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావించాలన్నారు మంత్రి తలసాని. ఇదిలా ఉంటే… తెలంగాణలో పూర్తిగా అనుకున్న ఆశయాలు నెరవేకుండానే గద్దర్ వెళ్లిపోయారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన ఎక్కడి ఇబ్బందులు అక్కడే ఉన్నాయని గద్దర్ భావించారన్నారు. దానిలో బాగంగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని తనతో గద్దర్ చెప్పారని వెల్లడించారు. గద్దర్ భావించిన , ఉహించిన తెలంగాణ రాలేదని చాల బాధ పడ్డారని కిషన్ రెడ్డి తెలిపారు. నిజానికి చాలా సందర్భాల్లో గద్దర్ సైతం ఈ విషయాన్ని వెల్లడించారు.

Show comments