NTV Telugu Site icon

Bandi Sanjay : పార్టీల మధ్య విమర్శలు సహజం.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడద్దు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ ఎల్లమ్మ ఆలయం ఆవరణలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 24 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. రాజకీయ విమర్శలతో గత ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అలాగే ప్రవర్తిస్తుందన్నారు బండి సంజయ్‌. కాంగ్రెస్ ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేశాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుందని చెప్పానని, కేంద్ర ప్రభుత్వం సకరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. పార్టీల మధ్య విమర్శలు సహజం, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడద్దని, మహారాష్ట్రలో 220 సీట్లకు పైగా గెలుస్తుందన్నారు బండి సంజయ్‌. మహారాష్ట్రలో ఓటమికి కారణం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యంత్రులే అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

BSNL Recharge Plan: బంపర్ ఆఫర్.. కేవలం రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ

అంతేకాకుండా.. వేములవాడ మండలం సంకపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 15 లక్షలతో భూమి పూజ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో సీసీ రహదారులు నేషనల్ హైవేల నిర్మాణాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి నేటి వరకు గ్రామపంచాయతీలకు , మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒక రూపాయి నిధులు కేటాయించలేదన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ప్రసాదం స్కీమ్ లో చేర్చుతున్నామని, ప్రసాదం స్కీం లో చేర్చుతుండడంతో హడావిడిగా ఆలయ అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి అని ఆయన అన్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే సంతోషిస్తాను, స్వాగతిస్తానని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి రాష్ట్రానికి నిధులు రాకుండా చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే తరహాలో వ్యవహరిస్తుందని, వేములవాడకు రైల్వే లైన్ తీసుకొచ్చేది కేంద్ర ప్రభుత్వమే అని ఆయన తెలిపారు. తెలంగాణ ఎంపీలలో రాష్ట్రానికి అధిక నిధులు తీసుకొచ్చింది నేనే అని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు బండి సంజయ్‌.

Kalpana Soran: కేబినెట్‌లోకి కల్పనా సోరెన్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్!