Site icon NTV Telugu

VC Sajjanar : రోడ్లపై నిర్లక్ష్య ప్రయాణం.. “జాగ్రత్త లేకుంటే ప్రాణాల మీదికి” అంటున్న సజ్జనార్

Viral

Viral

VC Sajjanar : హైదరాబాద్ మహానగరంలో రోడ్డుప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వాహనదారుడు బైక్‌పై తీవ్ర నిర్లక్ష్యంతో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటోను చూస్తే, వ్యక్తి బైక్‌పై పెద్ద పెద్ద మూటలు కట్టుకొని, ఆ మూటల మధ్య ఓ మహిళను వెనుక కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు. ఈ ప్రమాదకర ప్రయాణ దృశ్యాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.

Pooja Hegde : దాని కోసం ఎక్స్‌ట్రా వర్కౌట్లు చేయకతప్పదు..

ఈ సందర్భంగా సజ్జనార్ స్పందిస్తూ, “పట్టు తప్పితే ప్రాణాలకే ప్రమాదం. ప్రమాదమని తెలిసినా, కొందరు ఇలాగే నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారు” అన్నారు. సమయాన్ని ఆదా చేయాలని, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలని ఉండే తాపత్రయంతో కొన్ని చిన్న నిర్ణయాలు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. “మీ క్షేమమే ముఖ్యమని గుర్తుంచుకోండి. ప్రమాదపుటంచున ప్రయాణం చేయకండి. సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వండి” అంటూ ప్రజలకు సూచించారు.

Single : కేతిక కల నెరవేర్చిన శ్రీ విష్ణు

Exit mobile version