Fraud : నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేసిన కల్వకుర్తికి చెందిన ముజమ్మిల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయలతో పరారయ్యాడు నిందితుడు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఇస్తానని ఆకర్షించిన ముజమ్మిల్.. 2020లో ఆర్ సి ఇన్ఫ్రా, ట్రై కాలర్ పేరుతో వెంచర్లు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారం ప్రారంభించాడు. 24 మంది ఏజెంట్లతో అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారంను స్టార్ట్ చేశాడు. అయితే.. 2020-2023 వరకు పెట్టుబడి పెట్టిన వారికి ఒక లక్షకు 50 వేలు అధిక వడ్డీ చెల్లించిన ముజమ్మిల్.. 2023 ఆగస్టు నుండి పరారీలో ఉన్నాడు. అయితే.. అధిక వడ్డీ ఇస్తానంటూ కల్వకుర్తి పరిసర ప్రాంతాల ప్రజల వద్ద రూ.90 కోట్లు తీసుకుని 50 కోట్లు తిరిగి ఇచ్చాడు. మిగతా 40 కోట్లుతో ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టాడు. ఇటీవల తనను కొందరు వ్యక్తులు ట్రేడింగ్ పేరుతో మోసం చేసినట్లు ముజమ్మిల్ వీడియో విడుదల చేశాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ముజమ్మిల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు..
PM Modi: నెహ్రూ గురించి తెలియాలంటే “జాన్ ఎఫ్ కెన్నడీ పుస్తకం చదవండి”..