Murder : గత నెల 30 తేదీ జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు ను బాలనగర్ పోలీసులు ఛేదించారు. ఏడుపాయల దగ్గర తాగిన మైకంలో స్నేహితున్ని కొట్టి చంపి ఆటోలో తీసుకు వచ్చి బాలానగర్ పరిధిలో ఖైతాన్ కంపెనీ రోడ్డు పక్కన చెత్తలో పడేసి పారిపోయారు. మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఎడమ చెవి నుండి రక్తం కారుతున్నట్లు గుర్తించి, పరిశీలించగా రెండు చేతులపై రెండు పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించి గుర్తించారు. దర్యాప్తులో నిందితులు ఆకుల కృష్ణ ముదిరాజ్ జీడిమెట్లలో నివాసం ఉంటున్నాడు. అయితే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆకుల కృష్ణ, తన స్నేహితులతో కృష్ణగౌడ్‌కు పరిచయం ఏర్పడింది.
Budget 2025: రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు.. ఆధునికీకరణకు పెద్దపీట..
అయితే.. ఆటో సెల్ఫ్ మోటర్ రిపేర్ విషయంలో మృతుడి కృష్ణ గౌడ్‌కి, ఎ-1 ఆకుల కృష్ణకు మధ్య గతంలో గొడవ జరిగింది. దాని కారణంగా కృష్ణగౌడ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో దుర్గ భవాని దేవాలయం, ఏడుపాయల వెళ్ళి కృష్ణగౌడ్‌కు విపరీతంగా మద్యం తాగించి దారుణంగా హత్య చేశారు. పిడిగుద్దులతో కృష్ణగౌడ్‌పై దాడి చేసి.. ఆటోలోని మెటల్ ఫ్రేమ్ రాడ్‌లతో మృతుడి తలను కొట్టాడు. అంతేకాకుండా.. ఆటోలో కృష్ణగౌడ్ వృషణాలను నలిపి చంపినట్లుగా దర్యాప్తులో నిందితులు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులు సైతం ధృవీకరించారు. ఈనేపథ్యంలో నిందితుల Al-ఆకుల కృష్ణ, గాజులరామారం, A2-మదరబోయున రవి, సనత్ నగర్, A3-గుర్రం నరేష్ సనత్‌నగర్, A4-గంబు శంకర్ గౌడ్ సనత్‌నగర్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఆటో ను, మృతుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు.
Dil Raju :‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నాకు గుణపాఠం నేర్పింది.. దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు