T20I Fastest Centuries: T20I చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన టీమిండియా స్టార్స్ వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20I Fastest Centuries: T20I చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన టీమిండియా స్టార్స్ ఎవరో తెలుసా.. ఈ రికార్డులో ముందు వరుసలో క్రికెట్ ప్రేమికులు ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకునే రోహిత్ శర్మ ఉన్నాడు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్సింగ్‌లో హిట్‌మ్యాన్ బ్యాట్ మామూలుగా గర్జించలేదు. ఏకంగా 10 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొత్తంగా 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఈ సెంచరీ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒక ఇండియన్ క్రికెటర్ చేసిన వేగవంతమైన సెంచరీగా రికార్డ్ సృష్టించింది.
READ ALSO: February Born Secrets : వీరికి ఉండే ఆ అద్భుత శక్తులు ఏంటో తెలుసా.?
Also Read
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్‌కు భారత్ విజ్ఞప్తి
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న క్రికెటర్.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. మైదానంలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లను షేక్ చేస్తున్న అభిషేక్ శర్మఇంగ్లాండ్‌పై ఈ రికార్డ్‌ను నెలకొల్పాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ చేసి భారత్ తరుఫున T20I చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన రెండవ వ్యక్తిగా నిలిచాడు. ఈ యువ ఓపెనర్ 2025లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డును సాధించాడు. అతను ఈ మ్యాచ్‌లో మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి.
ఈ జాబితాలో మూడవ స్థానంలో సంజు శాంసన్ ఉన్నాడు. నిజానికి ఇటీవల కాలంలో ఫామ్‌లేమితో అవస్థలు పడుతున్న సంజు శాంసన్ గతంలో సూపర్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ బ్యాటర్ 2024లో చేసిన అద్భుతమైన ప్రదర్శన ఎప్పటికీ టీమిండియా అభిమానుల మదిలో నిలిచే ఉంటుంది. ఆ ఏడాది శాంసన్ అతను T20 ఫార్మాట్‌లో జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఆ టైంలో సంజు శాంసన్ హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై 40 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది ఈ ఫార్మాట్‌లో ఒక భారతీయుడు చేసిన మూడవ వేగవంతమైన సెంచరీ. శాంసన్ ఆ ఇన్సింగ్‌లో 47 బంతుల్లో 11 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 111 పరుగులు నమోదు చేశాడు.
T20 అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగవ వేగవంతమైన సెంచరీ రికార్డును కలిగి ఉన్న టీమిండియా బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ. జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై 41 బంతుల్లో సెంచరీ నమోదు చేసి ఈ రికార్డ్‌ను నెలకొల్పాడు. ఈ ఇన్సింగ్స్‌లో తిలక్ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు. ఐదవ వ్యక్తి.. ఇషాన్ కిషన్.
వాస్తవానికి ఇషాన్ కిషాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో చిరస్మరణీయమైన ఇన్సింగ్స్‌తో పునరాగమనం చేశాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో శాశ్వత స్థానం కోసం తన సూపర్ ఇన్సింగ్స్‌తో సెలక్టర్లను సవాల్ చేశాడు. 2025లో త్రివేండ్రంలో న్యూజిలాండ్‌తో జరిగిన T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఐదవ వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన టీమిండియా ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఇన్సింగ్స్‌లో ఇషాన్ 43 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.
READ ALSO: BCCI Budget 2026-27: టీం ఇండియా బడ్జెట్.. బీసీసీఐ ఖజానాలోకి వేల కోట్లు ఎలా వస్తాయంటే?
తాజావార్తలు
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
-
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
-
Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్‌కు భారత్ విజ్ఞప్తి
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!