T20 World Cup 2026: శ్రీలంక, జింబాబ్వే చేతిలో పరాజయం.. ఆస్ట్రేలియా పతనానికి అసలు కారణాలు ఇవే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8 దశకు ఆస్ట్రేలియా చేరకపోవడం క్రికెట్ ప్రపంచానికే పెద్ద షాక్‌గా మారింది. వరల్డ్ కప్ అంటే ఆస్ట్రేలియా దూకుడుగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం కథ పూర్తిగా మారిపోయింది. గ్రూప్-బీలో శ్రీలంకతో పాటు జింబాబ్వే ముందుకు వెళ్లగా, 2021 చాంపియన్ అయిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి బయటపడాల్సి వచ్చింది. జింబాబ్వే, శ్రీలంకల చేతిలో వచ్చిన పరాజయాలు ఆస్ట్రేలియాను మళ్లీ కష్టాల్లోకి నెట్టాయి. చివరగా ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో మిచెల్ మార్ష్ జట్టు ఆశలు పూర్తిగా ముగిశాయి. ఆ ఫలితం వచ్చిన వెంటనే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ హీలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టుపై హీలీ తీవ్రంగా మండిపడ్డాడు. శ్రీలంక, భారతదేశం వంటి స్పిన్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో ఆడాల్సి ఉంటుందని తెలిసినా, పూర్తిగా పవర్ హిట్టర్లతో కూడిన జట్టును ఎంపిక చేయడం పెద్ద తప్పిదమని అన్నాడు. టెక్నిక్, ఓపిక, మంచి ప్రారంభం ఇవ్వగల బ్యాట్స్‌మెన్‌లకు ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించాడు. జట్టులో మార్పులు సైతం సరైన సమయంలో చేయలేదని భావించాడు. కీలక మ్యాచ్‌లో ఇద్దరు బౌలర్లు, ఒక ముఖ్యమైన బ్యాట్స్‌మన్‌ను తప్పించి ఆల్‌రౌండర్‌ను తీసుకోవడం అర్థం కాని నిర్ణయమని చెప్పాడు.
READ MORE: Dwaraka: ‘ఇన్‌స్టా రీల్ కోసం నా బిడ్డ ప్రాణాన్ని తీశారు..’ సహిల్ తల్లి కన్నీటి కథ!
Also Read
- Human Skeletons: బయటపడ్డ తలలు లేని అస్థిపంజరాలు.. ఏంటా మిస్టరీ..
- Sanchita Ugale: మరాఠీ నటి సంచితా ఉగలే మృతికి కారణమిదేనా? ఇంత జరిగిందా?
- Nagpur: ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం, మతం మార్చుకోవాలని ఒత్తిడి.. సంచలనంగా నాగ్‌పూర్ వైరల్ వీడియో..
- Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
బ్యాటింగ్ ఆర్డర్‌ను పొడిగించాలనే పేరుతో చేసిన ఈ మార్పులు జట్టును మరింత అసమతుల్యంగా మార్చాయని అభిప్రాయపడ్డాడు. కూపర్ కొన్నోలీను జట్టులోకి తీసుకోవడంపై కూడా హీలీ ప్రశ్నలు లేవనెత్తాడు. వరుసగా పరుగులు చేయలేకపోతున్న ఆటగాడిని కీలక సమయంలో ఎందుకు తీసుకున్నారని అడిగాడు. జట్టులో అందరూ ఫినిషర్లే ఉన్నారు కానీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే స్థిరమైన బ్యాట్స్‌మెన్ లేరని విమర్శించాడు. క్యామెరన్ గ్రీన్ను మూడో స్థానంలో, టిమ్ డేవిడ్ను నాలుగో స్థానంలో, జోష్ ఇంగ్లిస్ను ఎప్పుడో ఓపెనర్‌గా, ఎప్పుడో మిడిల్ ఆర్డర్‌లో ఆడించడం వల్ల వారి ఫామ్ వృథా అయిందని అన్నారు. సరైన పాత్రలు ఇవ్వకపోవడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిందని తెలిపారు. గత ఏడాది నుంచే సెలెక్షన్‌లో పొరపాట్లు జరిగాయని, పవర్ హిట్టింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి టెక్నిక్, ఫామ్, మ్యాచ్ పరిస్థితులను పట్టించుకోలేదని హీలీ అభిప్రాయపడ్డాడు. చివరకు అదే ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పాడు.
READ MORE: Hyderabad: మాజీ భర్త కిరాతకం.. రెండో పెళ్లి చేసుకుందని కత్తులతో పొడిచి దారుణ హత్య
తాజావార్తలు
-
FIFA World Cup 2026: “వెంటనే యూఎస్ విడిచి వెళ్లండి”.. ఫిఫా వరల్డ్ కప్‌లో ఇరాన్‌కు ఘోర అవమానం..
-
Human Skeletons: బయటపడ్డ తలలు లేని అస్థిపంజరాలు.. ఏంటా మిస్టరీ..
-
Uddhav Thackeray: మరోసారి ముక్కలు కాబోతున్న శివసేన పార్టీ? కుప్పకూలుతున్న ఉద్ధవ్ సామ్రాజ్యం!
-
Sanchita Ugale: మరాఠీ నటి సంచితా ఉగలే మృతికి కారణమిదేనా? ఇంత జరిగిందా?
-
Nagpur: ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం, మతం మార్చుకోవాలని ఒత్తిడి.. సంచలనంగా నాగ్‌పూర్ వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?