FIFA World Cup 2026: “వెంటనే యూఎస్ విడిచి వెళ్లండి”.. ఫిఫా వరల్డ్ కప్‌లో ఇరాన్‌కు ఘోర అవమానం..
- మ్యాచ్ ముగిసిన వెంటనే అమెరికా విడిచి వెళ్లాలి.
- ఫిఫా వరల్డ్ కప్‌లో ఇరాన్‌కు ఘోర అవమానం.
- కోలుకునే సమయం కూడా ఇవ్వలేదని ఇరాన్ కోచ్ ఆరోపణ.
- పలువురు ఇరాన్ అధికారులకు అమెరికా వీసాలు నిరాకరణ.
- "వరల్డ్‌కప్‌లో అత్యంత అణచివేతకు గురైన జట్టు మాదే" అని కోచ్ వ్యాఖ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఫిఫా వరల్డ్ కప్‌కు కూడా చేరాయి. టోర్నలో పాల్గొంటున్న ఇరాన్ ఫుట్బాల్ం జట్టుకు తీవ్ర అవమానం ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం, వెంటనే అమెరికా విడిచి మెక్సికోలోని శిక్షణా శిబిరానికి తిరిగి వెళ్లాలని అమెరికా ఇరాన్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఇరాన్ కోచ్ అమీర్ ఘలేనోయీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాస్ ఏంజెల్స్‌లో సోఫై స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. సాధారణంగా మ్యాచ్ జరిగిన తర్వాత ప్లేయర్లు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంటుంది. కానీ అమెరికా అధికారులు ఇరాన్ జట్టును వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. తమకు కనీస సమయం కూడా ఇవ్వకుండా వెంటనే మెక్సికోలోని టిజువానాకు వెళ్లాలని సూచించినట్లు కోచ్ చెప్పారు. మాకు కనీసం కోలుకునే సమయం కూడా ఇవ్వలేదని, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదని అన్నారు. ఈ వరల్డ్ కప్‌లో అత్యంత అణచివేతకు గురైన జట్టు మాదే అని కోచ్ వ్యాక్యానించారు. తమ జట్టుకు సంబంధించిన అనేక నిర్ణయాలు వేరే వాళ్లు తీసుకుంటున్నారని అన్నారు.
Also Read
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
ఇరాన్ కెప్టెన్ మెహ్దీ తారెమీ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ జట్టులో చాలా మందికి అమెరికా వీసాలు కూడా లభించలేదని చెప్పారు. ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు, కోచింగ్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు సహా పలువురు కీలక సభ్యులు జట్టుతో చేరలేకపోయారని వెల్లడించారు. ఇరాన్, అమెరికా ఉద్రికత్ పరిస్థితుల నేపథ్యంలో తమ గ్రూప్ దశ మ్యాచ్‌లను అమెరికా వెలుపల నిర్వహించాలని ఫిఫాను కోరినప్పటికీ, ఇరాన్ అభ్యర్థనకు ఆమోదం దొరకలేదు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!