ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడితో పాటు మరోవైపు క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే టి20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికాలో మొదలుకానుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ జూన్ 2 నుంచి 29 వరకు జరగబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కు సంబంధించిన అనేక ప్రచారాలను చేస్తుంది ఐసీసీ.
Also read: MS Dhoni Alert: ధోని బస్సు ఎక్కడానికి రూ.600 కావాలట.. పోస్ట్ వైరల్..
ఈ నేపథ్యంలో తాజాగా ఐసీసీ ఓ ప్రపంచ పేరుగాంచిన స్టార్ అథ్లెట్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. 8సార్లు ఒలంపిక్ గోల్డ్ మెడల్ విజేత, జమైకా పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్ ను టీ20 ప్రపంచ కప్ అంబాసిడర్ గా ఐసీసీ నియమించింది. ఈ సందర్భంగా ఉసెన్ బోల్ట్ మాట్లాడుతూ.. తాను ఈ ప్రపంచ కప్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతూ.. వరల్డ్ కప్ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
Also read: IPL: ఢిల్లీ యువ ఫేసర్ రసీఖ్ సలాంకు బీసీసీఐ మందలింపు
ఇకపోతే జరగబోయే టి20 వరల్డ్ కప్ ఆడేందుకు ఇప్పటికే 20 దేశాలు అర్హత పొందాయి. వీటిని మొత్తం 4 గ్రూపులుగా విభజించి పోటీలను నిర్వహించనున్నారు. ప్రతి గ్రూప్ లో 5 టీంలు ఉండగా.. ప్రతి టీం మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. అలా నాలుగు మ్యాచ్ లు ఆడిన తర్వాత ప్రతి గ్రూపులో ఉన్న టాప్ 8 లో నిలిచిన జట్లు సూపర్-8 కి అర్హత సాధిస్తాయి. ఇక్కడ సూపర్-8 దశలో ప్రతి టీం ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడతాయి. అందులో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీఫైనల్ మ్యాచులు ఆడనున్నాయి. ఇక చివరిగా జూన్ 29న ఫైనల్ మ్యాచ్ బార్బోడస్ వేదికగా జరగనుంది.