NTV Telugu Site icon

T20 World Cup 2024: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. టీ20 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ!

Ms Dhoni Captain

Ms Dhoni Captain

Is MS Dhoni Rturn to Team India as Mentor for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్‌ 2024 ఆరంభం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. కప్పే లక్ష్యంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో చేజార్చుకున్న భారత్.. పొట్టి కప్‌ను అయినా సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం బలమైన జట్టును ఎంపిక చేయాలని సెలక్టర్లకు బీసీసీఐ ఇప్పటికే సూచనలు చేసింది. అయితే ప్రపంచకప్‌కు ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

ఎలాగైనా భారత జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని భాగం చేయాలని బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత జట్టు మెంటార్‌గా ధోనీకి బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట. డ్రెస్సింగ్ రూమ్‌లో మిస్టర్ కూల్ ఉంటే జట్టుకు అదనపు బలం చేకూరుతుందని భావిస్తోందట. ధోనీ అనుభవం, సూచనలను వాడుకోవాలని బీసీసీఐ ప్రయత్నిస్తోందని సమాచారం. మరి బీసీసీఐ ఆఫర్‌ను మహీ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ధోనీ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.

Also Read: SRH vs RCB: ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం.. ఇంపాక్ట్ ప్లేయర్‌పై వేటు!

ఎంఎస్ ధోనీని భారత జట్టు మెంటార్‌గా నియమించడానికి మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు ముగిసిన అనంతరం ధోనీకి ఆ పదవిలోకి తీసుకురావాలని బీసీసీఐ చూస్తోందట. అందుకే ముందుగా మెంటార్‌గా బాధ్యతలు అప్పజెప్పి.. ఆపై హెడ్ కోచ్‌గా పదవి కట్టబెట్టాలని బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసిందట. ఒకవేళ హెడ్ కోచ్‌గా మహీ ఒప్పుకోకుంటే.. మెంటార్‌గా అయినా జట్టుతో కొనసాగించి, వీవీఎస్ లక్ష్మణ్‌‌‌ను కోచ్‌గా ఎంపిక చేయాలని చూస్తోందట. మొత్తానికి ఏదో ఒక పదవి ఇచ్చి ధోనీ భారత జట్టుతో ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments