Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Syed Ahmed Mohiuddins Brother Defends Him After Gujarat Ats Arrest Claims He Was Framed

Syed Ahmed Mohiuddin: మా బ్రదర్ మంచోడు, కావాలనే ఎవరో ఇరికించారు.. మొహియుద్దీన్‌ సోదరుడి ఆవేదన!

Published Date :November 12, 2025 , 1:28 pm
By Sampath Kumar
  • డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌ మొహియుద్దీన్‌ అరెస్టు
  • మొహియుద్దీన్‌ అరెస్టుపై స్పందించిన కుటుంబ సభ్యులు
  • మా బ్రదర్ మంచోడు, కావాలనే ఎవరో ఇరికించారు
Syed Ahmed Mohiuddin: మా బ్రదర్ మంచోడు, కావాలనే ఎవరో ఇరికించారు.. మొహియుద్దీన్‌ సోదరుడి ఆవేదన!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌ మొహియుద్దీన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొహియుద్దీన్‌ అరెస్టుపై కుటుంబ సభ్యులు స్పందించారు. మొహియుద్దీన్‌ సోదరుడు ఒమర్‌ ఫారూఖీ ఎన్టీవీతో ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడాడు. తన సోదరుడు మంచోడని, ఎవరో కావాలనే కుట్రలో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన బ్రదర్ ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్లు తెలియదని చెప్పాడు. ఒకవేళ తమ సోదరుడు తప్పు చేస్తే కఠినంగా శిక్షించండని ఒమర్‌ ఫారూఖీ అంటున్నాడు.

చార్మినార్‌లోని రెహమానియా మదర్సాలో మౌలనాగా పనిచేస్తున్న ఒమర్‌ ఫారూఖీ మాట్లాడుతూ… ‘మా సోదరుడు మొహియుద్దీన్ ఎవరో ట్రాప్ చేసి ఈ కుట్రలో ఇరికించారు. మా బ్రదర్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్లు మాకు తెలియదు. నవంబర్ 5న బిజినెస్ డీల్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి గుజరాత్ బయల్దేరాడు. 9వ తేదీన ఏటీఎస్ వారు నాకు ఫోన్ చేసి మీ బ్రదర్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, అరెస్ట్ చేశాం అని చెప్పారు. మొహియుద్దీన్ నివాసాన్ని ముట్టొద్దు, 2 రోజుల్లో వచ్చి ఆయన రూమ్‌లో ఉన్న సామగ్రి స్వాధీనం చేసుకుంటాం అని ఏటీఎస్ పోలీస్ చెప్పారు. ఇంటికి ఏటీఎస్ పోలీసులు వచ్చారు, సామాన్లు సీజ్ చేసి తీసుకువెళ్లారు. ఏటీఎస్ అరెస్టు చేసినవారిలో మరో ఇద్దరు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహైల్ వారితో మాకు ఎలాంటి లింక్స్ లేవు’ అని అన్నాడు.

Also Read: Rohit-Kohli: వన్డేల్లో కొనసాగాలంటే.. రో-కోకు బీసీసీఐ వార్నింగ్!

‘మొహియుద్దీన్ ఆముదం గింజల నుంచి రెసిన్ విషం తయారు చేసినట్లు నిఘా వర్గాల అనుమానం. అందులో వాస్తవం ఏంటో మాకు తెలియదు. ఈ విషాన్ని మంచినీటి వ్యవస్థ, దేవాలయ ప్రసాద నీటిలో కలపాలని కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ హ్యాండ్లర్ అబూ ఖదీజా నుంచి టెలిగ్రాంలో ఆదేశాలు అందినట్లు ఏటీఎస్ వారు కనుగొన్నట్లుగా తెలుస్తుంది. మొహియుద్దీన్ ఫోన్లో లొకేషన్ ఆఫ్ చేసి, చాటింగ్ టెలిగ్రామ్ ద్వారా మాత్రమే ఇదంతా చేశాడా అన్నది మాకు తెలియదు. ఇంట్లోనే రెసిన్ తయారీ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు ఏటీఎస్ పోలీస్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మొయినుద్దీన్ తిరిగిన మార్గాలపై పోలీస్ ఫోకస్ పెట్టారేమో. కేంద్ర ప్రభుత్వం పూర్తి విచారణ జరపాలి. మొహియుద్దీన్ 2007–2013 మధ్య చైనాలో మెడిసిన్ చదివాడు. 2021లో వివాహం అయింది. కొంతకాలం అమెరికాలో ఉద్యోగం చేశాడు. రాజేంద్రనగర్ అసద్ మంజిల్, పోర్ట్‌వ్యూ కాలనీలో నివాసం ఉంటున్నాం. మా స్వస్థలం ఖమ్మం. 20 ఏళ్లుగా కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. నేను చార్మినార్ రెహమానియా మదర్సాలో మౌలానాగా పనిచేస్తున్నా. ఏ మతం కూడా తీవ్రవాదంను ప్రోత్సహించాలని అనుకోదు. ఉగ్రవాదం, ఉగ్రవాదుల దాడులకు మా మతం వ్యతిరేకం. ఒకవేళ మా సోదరుడు తప్పు చేస్తే కఠినంగా శిక్షించండి’ అని ఒమర్‌ ఫారూఖీ చెప్పాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gujarat ATS arrest
  • Hyderabad doctor arrest
  • Omar Farooqui
  • Omar Farooqui statement
  • resin poison plot

తాజావార్తలు

  • Ragi Milk Recipe: వేసవి దాహాన్ని తీర్చే నేచురల్ ఎనర్జీ డ్రింక్.. ఇంట్లోనే టేస్టీ ‘రాగి పాలు’ చేసుకోండిలా!

  • War Effect: యుద్ధం ఎఫెక్ట్.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్..

  • Iron Rich Foods: బాబోయ్ బ్లడ్ తగ్గిందా?.. ఇవి తింటే సరిపడా రక్తం పడుతుంది!

  • GHMC : ఇల్లు కట్టడం ఈజీ.. GHMC గుడ్‌న్యూస్..

  • US-Iran War: అమెరికా F-35 పైలట్‌ను పట్టుకున్నాం: ఇరాన్

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions