NTV Telugu Site icon

Big Bash League: 15 పరుగులకే ఆలౌట్.. బిగ్‌బాష్‌ లీగ్‌లో చెత్తరికార్డు

Bbl

Bbl

Big Bash League: బిగ్‌బాష్‌ లీగ్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌ 15 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం. సిడ్నీ థండర్స్ జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయింది. పురుషుల సీనియర్ టీ20 క్రికెట్‌లో ఇది అతి తక్కువ స్కోరు. ఇప్పటివరకు ఈ చెత్తరికార్డు టర్కీ పేరిట ఉండేది. టర్కీ జట్టు చెక్ రిపబ్లిక్ జట్టుతో మ్యాచ్ లో 21 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు టర్కీ జట్టుకు ఊరట కలిగిస్తూ సిడ్నీ థండర్ జట్టు ఆ రికార్డును తన పేరిట లిఖించుకుంది.

Sanskrit: 2500 ఏళ్ల నాటి సంస్కృత గ్రామర్ సమస్యను పరిష్కరించిన 27 ఏళ్ల యువకుడు

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌లో క్రిస్‌ లిన్‌ 36 పరుగులతో టాప్‌ స్కోరర్ కాగా.. కొలిన్‌ డీ గ్రాండ్‌హోం 33 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్‌ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. గురీందర్‌ సందు, డేనియల్‌ సామ్స్‌, బ్రెండన్‌ డోగ్గెట్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ 5.5 ఓవర్లకే 15 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ బౌలర్లలో హెన్రీ థోర్న్ టన్, వెస్ అగర్ వికెట్ల పండగ చేసుకున్నారు. థోర్న్ టన్ 3 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా, వెస్‌ అగర్ 6 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మాథ్యూ షార్ట్ 1 వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు 124 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. సిడ్నీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్‌గా వెనుదిరగ్గా.. మిగతా ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.