NTV Telugu Site icon

Swiggy Layoff: తప్పదు తగ్గించాల్సిందే.. ఈ సారికి 250మాత్రమే అంటున్న స్విగ్గీ

Swiggy

Swiggy

Swiggy Layoff: ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం నేపథ్యంలో బడాకంపెనీలు చాలావరకు ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి. పనితీరు సరిగి లేని ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ కంపెనీలైన స్విగ్గీ, జొమాటోలు ఇదే బాట పట్టాయి. తాజాగా స్విగ్గీ డిసెంబర్‌లో 250 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసింది. కంపెనీలో దాదాపు 3నుంచి 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే పోటీదారు సంస్థ అయిన జొమాటో నవంబర్ నెలలో కంపెనీ ఉద్యోగుల్లో మూడు శాతం మంది ఉద్యోగులను తొలగించింది.

Read Also: Ram Gopal Varma: 400 మంది అమ్మాయిలతో సెక్స్ చేశా.. అందులో బాగా ఎవరు నచ్చారంటే..?

అమెరికా, యూరప్ దేశాల్లో ఏర్పడ ఆర్థిక మాంద్యం మన దేశ టెక్నాలజీ కంపెనీలకు పరీక్షగా మారింది. ఎందుకంటే, ఇక్కడి కంపెనీలకు నిధులు సమకూర్చేది అక్కడి ఇన్వెస్టర్లే కావడం ఒక కారణమైతే.. మరోవైపు భారీ నష్టాలతో నడిచే కంపెనీలకు వాల్యూషన్ విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పు వచ్చింది. అందుకని దాదాపు అన్ని టెక్నాలజీ కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి.

Read Also: Gujarat Election Results 2022: గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌..

రానున్న రోజుల్లో ఈ కంపెనీల్లో తొలగింపులు ఎక్కువే ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై స్విగ్గీ అధికారికంగా స్పందిస్తూ.. ఇప్పటి వరకు అయితే తొలగింపులు లేవని స్పష్టం చేసింది. అలాగే, ఈ నెలలో, సమీప కాలంలో తొలగింపులను కాదనలేమని కూడా చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్ లో ఉద్యోగుల పనితీరును స్విగ్గీ మదింపు వేసి, రేటింగ్ లు ఆధారంగా పదోన్నతులు కూడా కల్పించింది. స్విగ్గీ ఇన్ స్టంట్ గ్రోసరీ విభాగమైన ఇన్ స్టామార్ట్ లో నష్టాలు పెరగడంతో అక్కడి నుంచి కొంత మంది ఉద్యోగులను ఇతర విభాగాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.