NTV Telugu Site icon

Vijayawada Trains: రైలు ప్రయాణికులకు తీపి కబురు.. గతంలో రద్దైన విజయవాడ రైళ్ల పునరుద్ధరణ

Pakisthn Mp (6)

Pakisthn Mp (6)

భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో విజయవాడ రూట్‌లో ప్రయాణించిన రైళ్లను రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రైళ్లను పునరుద్ధరించింది. ఈ రైళ్ల వివరాలు తెలుసుకోండి. రైలు నెంబర్ 17258 కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాకినాడ పోర్టులో తెల్లవారుజామున 4.10 గంటలకు బయల్దేరితే ఉదయం 9.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07628 విజయవాడ నుంచి గుంటూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరితే ఉదయం 10.50 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07786 గుంటూరు నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గుంటూరులో ఉదయం 11.20 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 1 గంటకు రేపల్లె చేరుకుంటుంది. రైలు నెంబర్ 07873 రేపల్లె నుంచి తెనాలికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో తెల్లవారుజామున మధ్యాహ్నం 1.10 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 2.10 గంటలకు తెనాలికి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07630 తెనాలి నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 2.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07500 విజయవాడ నుంచి గూడూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో మధ్యాహ్నం 4.45 గంటలకు బయల్దేరితే అర్ధరాత్రి 12.40 గంటలకు గూడూరుకు చేరుకుంటుంది.

Read more: International Yoga Day 2024: ఎత్తు పెరగాలంటే ఈ మూడు ఆసనాలు ట్రై చేయండి

రైలు నెంబర్ 07876 తెనాలి నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరితే సాయంత్రం 5.40 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07787 రేపల్లె నుంచి గుంటూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో సాయంత్రం 6 గంటలకు బయల్దేరితే రాత్రి 7.55 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07458 గూడూరు నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గూడూరులో ఉదయం 6.10 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 3.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07781 విజయవాడ నుంచి మాచర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరితే రాత్రి 9.35 గంటలకు మాచర్లకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07782 మాచర్ల నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మాచర్లలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరితే ఉదయం 10.55 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07629 విజయవాడ నుంచి తెనాలికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో ఉదయం 11.15 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 12.20 గంటలకు తెనాలికి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07874 తెనాలి నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 3.20 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07875 రేపల్లె నుంచి తెనాలికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరితే సాయంత్రం 4.30 గంటలకు తెనాలికి చేరుకుంటుంది.

Read more: Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్..గుర్తు పట్టారా?

రైలు నెంబర్ 07282 తెనాలి నుంచి గుంటూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరితే సాయంత్రం 4.10 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07864 గుంటూరు నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గుంటూరులో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరితే సాయంత్రం 5.55 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 17257 విజయవాడ నుంచి కాకినాడ పోర్టుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో సాయంత్రం 6.25 గంటలకు బయల్దేరితే రాత్రి 11.35 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07887 గుంటూరు నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గుంటూరులో రాత్రి 9.10 గంటలకు బయల్దేరితే రాత్రి 9.55 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07888 తెనాలి నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో రాత్రి 10.40 గంటలకు బయల్దేరితే రాత్రి 11.40 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది.

Show comments