Site icon NTV Telugu

SwayambhuTeaser : స్వయంభు టీజర్.. నిఖిల్ అదరగొట్టాడుగా

Nikhil Swayambhu

Nikhil Swayambhu

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘ఎపిక్ టీజర్’ విడుదలైంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ చరిత్రలోని ఒక అన్ టోల్డ్ హీరో కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించబోతోంది.

టీజర్‌ పరిశీలిస్తే బాహుబలి లాంటి మరొక భారీ సినిమా ఫీలింగ్ అనిఇంచింది. భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంది అలాగే నిఖిల్ చెప్పిన “బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా.. కానీ, తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది” డైలాగ్స్  సినిమా థీమ్‌ను స్పష్టం చేస్తున్నాయి. ఒక సామాన్య వీరుడు అజేయమైన శక్తిగా ఎలా ఎదిగాడనేది ఈ చిత్రంలో ప్రధానాంశం. వేసవిలో ‘స్వయంభూ’ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధానికి సిద్ధమైంది. ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ‘బాహుబలి’ ఫేమ్ కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ మరియు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. నిఖిల్ ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా ఆయుధ విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. టీజర్‌లో ఆయన మేకోవర్ మరియు విజువల్స్ చూస్తుంటే, ‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ మరో గ్లోబల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version