NTV Telugu Site icon

Swati maliwal: దాడిపై బిభవ్ కుమార్ రియాక్షన్ ఇదే

Bibhav Kumar

Bibhav Kumar

రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ గౌరవ్ గోయల్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరారు. ఇదిలా ఉంటే బిభవ్ కుమార్‌ను పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా.. స్వాతి మాలివాల్‌పై ఎందుకు దాడి చేశారని మీడియా అడగ్గా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

ఇది కూడా చదవండి: Kanhaiya Kumar: “తుక్డే-తుక్డే వ్యాఖ్యలు, అప్జల్ గురు మద్దతు తెలిపినందుకే కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి చేశాం..

ఇదిలా ఉంటే స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తీస్ హజారీ కోర్టు కొట్టేసింది. అదనపు సెషన్స్ జడ్జి సుశీల్ అనుజ్ త్యాగి ఈ పిటిషన్‌ను తోసిపుచ్చారు. బిభవ్‌ను సాయంత్రం 4:15 నిమిషాలకు అరెస్ట్ చేసినట్లు అదనపు పబ్లిక్ ప్యాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ న్యాయమూర్తికి తెలియజేశారు. అనంతరం బిభవ్ కుమార్ పిటిషన్ కొట్టేశారు.

ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుంది.. వక్ఫ్ బోర్డుకు ఆస్తుల అప్పగింతపై ప్రధాని ఫైర్..

ఇదిలా ఉంటే స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను శనివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్‌కు తరలించి విచారించారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. సోమవారం కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ కుమార్ భౌతికదాడికి తెగబడ్డారు. దీంతో ఆయనపై గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎక్కడెక్కడ దాడి చేశాడో.. స్వాతి మాలివాల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Vijayashanti : పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి