NTV Telugu Site icon

Pithapuram: పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయకపోతే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా..

Varma

Varma

పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్‌ పోటీ చేస్తేనే నేను సహకరిస్తాను.. వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తాను అని ఆయన పేర్కొన్నారు. పవన్‌ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు నాయుడు చెప్పారు అని వర్మ తెలిపారు. కాగా, పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్‌ కల్యాణ్‌ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. బీజేపీ నాయకత్వం తనను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిందని పవన్‌ చెప్పారు.. మరోవైపు, కాకినాడ ఎంపీగా ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీ చేస్తారని జనసేన చీఫ్ పవన్ నిన్న ( మంగళవారం ) ప్రకటించారు.

Read Also: Abdul Khaliq: అబ్దుల్ ఖలిక్ యూటర్న్.. ఢిల్లీలో ఏం చేశారంటే..!

ఒక వేళ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు. తాను ఎంపీగా పోటీ చేస్తే.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్‌ పోటీ చేస్తా్రన్నారు. ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ ప్రకటించుకున్నారు.. ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్తానంటున్నారు.. ఇంతకీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో జనసేన పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.