Suzlon Energy: రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ షేర్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. కంపెనీ షేర్లలో ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణం కంపెనీకి వచ్చిన కొత్త వర్క్ ఆర్డర్. స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన సమాచారంలో సుజ్లాన్ ఎనర్జీ 14… 120-140 మీటర్ల విండ్ టర్బైన్ జనరేటర్లు, హైబ్రిడ్ లాటిస్ ట్యూబ్యులర్ టవర్లను వ్యవస్థాపించే పని ఆర్డర్ పొందినట్లు తెలిపింది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో కంపెనీ ఈ పని సాధించింది. సుజ్లాన్ తన ప్రతి టర్బైన్‌లలో 80 నుండి 90 శాతం దేశీయ పదార్థాలతో తయారు చేయబడిందని తెలిపింది. ‘సెల్ఫ్ రిలెంట్ ఇండియా’, ‘మేడ్ ఇన్ ఇండియా’ తీర్మానాలకు కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది. ఈ కొత్త వర్క్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు సీ అండ్ ఐ కస్టమర్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంటుందని కంపెనీ సీఈవో తెలిపారు.
శుక్రవారం బీఎస్ఈలో సుజ్లాన్ షేర్ రూ.25.49 వద్ద ప్రారంభమైంది. కంపెనీ ఇంట్రా-డే గరిష్టం రూ.25.86. ఇది 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.27కి చాలా దగ్గరగా ఉంది. సుజ్లాన్ 52 వారాల కనిష్టం ఒక్కో షేరుకు రూ.6.60. అదే సమయంలో మార్కెట్ క్యాప్ రూ.34,536.48 కోట్లుగా ఉంది. జీఎంపీ రూ. 100 దాటింది. ఐపీవో ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. గత 6 నెలల్లో సుజ్లాన్ షేరు ధరలు 226 శాతం పెరిగాయి. నెల క్రితం పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 22 శాతానికి పైగా లాభం పొందారు. గత 5 రోజుల్లో కంపెనీ షేర్ల ధరలు 8 శాతానికి పైగా పెరగడం ఇన్వెస్టర్లకు శుభపరిణామం.
Read Also:Ear Pods: అయ్యో.. విటమిన్ టాబ్లెట్ అనుకొని ఎయిర్ పోడ్స్ మింగిన మహిళ