Site icon NTV Telugu

Kolkata: ప్రముఖ ప్రాంతాలపై ఎగిరిన డ్రోన్ లాంటి వస్తువులు.. రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన..

Drone Summit

Drone Summit

ఆపరేషన్ సిందూర్ తర్వాత కోల్‌కతాలోని ప్రముఖ ప్రదేశాలపై రాత్రిపూట అనేక డ్రోన్ లాంటి వస్తువులు ఎగురుతూ కనిపించాయి. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్రమత్త మయ్యాయి. సోమవారం హేస్టింగ్స్ ప్రాంతం, పార్క్ సర్కస్, విద్యాసాగర్ సేతు, మైదాన్ మీదుగా కనీసం 8-10 మానవరహిత డ్రోన్‌లు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. డ్రోన్ లాంటి వస్తువులను మొదట హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ అధికారులు చూశారు.

READ MORE: Keeravani : పవన్ కళ్యాణ్ కార్చిచ్చు…ఎంత వాన పడినా ఆగేది లేదు!

“సోమవారం రాత్రి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మహేశ్తల దిశ నుంచి ఈ డ్రోన్ లాంటి వస్తువులు ఎగురుతూ కనిపించాయి. అవి హేస్టింగ్స్ ప్రాంతం, రెండవ హుగ్లీ వంతెన (విద్యాసాగర్ సేతు), ఫోర్ట్ విలియం (సైన్యం యొక్క తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం) మీదుగా సంచరించాయి.” అని ఒక పోలీసు అధికారి పీటీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. గూఢచర్యంతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంతలో ఈ అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ ఘటనపై కీలక ప్రకటన చేసింది. “ఆకాశంలో డ్రోన్ కార్యకలాపాలు కనిపించాయని మీడియా నుంచి మాకు సమాచారం అందింది. సమాచారం ప్రామాణికతను మేము పరిశీలిస్తున్నాం. ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దు. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండండి.” అని రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ పేర్కొంది.

READ MORE: Pakistan: మరోసారి బయటపడ్డ పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధం!

Exit mobile version