Site icon NTV Telugu

Suspicious Death : మలక్ పేటలో లా విద్యార్థిని అనుమానస్పద మృతి

Suicide

Suicide

Suspicious Death : హైదరాబాద్‌లోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారం బాగ్ ఓ కన్సుల్టెన్సీ ఆఫీస్ లో పనిచేస్తున్న గిరిజన యువతి, లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య(20) అనుమాన స్పద స్థితిలో ఆఫీస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. అయితే… హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ పీఎస్ ముందు గిరిజన సంఘాల నేతలు,కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కడ్తల్ పక్కన ఓ తాండకు చెందిన ఇస్లావత్ శ్రావ్య ఎల్బీనగర్ లోని మహాత్మా గాంధీ లా కళాశాలలో లా మూడవ సంవత్సరం చదువుతూ.. ఓ సీనియర్ అడ్వొకేట్ వద్ద జూనియర్ గా ఉంటూ మలక్ పేట మూసారం బాగ్ లోని ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది.

Mollywood : బ్లాక్ బస్టర్ హిట్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ‘నజ్రియా’

ఆదివారం ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని నవీన్ కార్యాలయంలో శ్రావ్య ఫాన్ కు ఉరి వేసుకొని మరణించడం జరిగింది. అయితే శ్రావ్య ది ఆత్మహత్య కాదు, లైంగిక వేధింపులు చేసి, హత్య చేశారని గిరిజన సంఘాలు మలక్ పేట లో మెట్రో స్టేషన్ వద్ద రాస్తారోకో కు దిగారు. గిరిజన యువతి మృతి కి కారకులైన నవీన్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన కొద్ది సేపటికే సమాచారం తెలిసిన పోలీసులు మృతదేహాన్ని వెంటనే ఎవరికి తెలపకుండా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించడం మరింత అనుమానంకు తావిస్తోందని ఆరోపించారు.

AP Rain Alert: దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం.. మరి కొద్ది గంటల్లో తీవ్రంగా మారే అవకాశం..

Exit mobile version