ఏప్రిల్ మూడో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించి తలపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమావేశం ఆసక్తిక రేకిస్తొంది. ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ సమావేశం ఉంటుందంటూ నాయకులకు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం చూస్తుంటే ఈ సమావేశానికి చాలా ప్రాధాన్య ఉన్నట్టు అర్థమవుతుంది. సీఎం ఎందుకు అత్యవసరంగా ఈ సమావేశం పెట్టారు? సీఎం ఎందుకు అందర్నీ పిలుస్తున్నారు? అనే డౌట్స్ నేతలలో మొదలయ్యాయి. త్రుల పని తీరు ఆధారంగా ఒకరిద్దరి ను కేబినెట్ నుంచి తప్పిస్తానని జగన్ మోహన్ రెడ్డి ఆ విషయం చెప్పడానికి ఈ సమావేశం పెట్టారా ? అనే డౌట్ తో కొంత మంది ఉన్నారు. మొదటి కేబినెట్ కూర్పు ఎలా ఉంటుంది అనేది శాసనసభ పక్ష సమావేశం లోనే చెప్పారు జగన్. ఇప్పుడు కేబినెట్ పునర్ అంకితం గురించి కూడా ఈ సమావేశంలో చెప్తారా? లేదా చూడాలి. శాసన మండలి నుంచి ఇద్దర్నీ కేబినెట్ లోకి తీసుకునే లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని ఈనెల 14వ తేదీన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మంత్రులందరికి చెప్పేశారు జగన్ ఏప్రిల్ 3 జరిగే ఈ సమావేశంలో అదే విషయాన్ని జగన్ చెప్తారో లేదో చూడాలి.
Also Read : Shreya Dhanwanthary: క్లివేజ్ షో చేయడంలో బ్రాండ్ అంబాసిడర్
అలాగే పట్టబద్ర ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ రాయలసీమలో అలాగే ఉత్తరంధర్లో మూడు సీట్లను పార్టీ కోల్పోవడంర పై నేతలకు సీఎం క్లాస్ తీసుకుంటారా? అనేది చర్చ నడుస్తుంది. దటిసారిగా పట్టబద్రుల కోట ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తున్నందువలన ఖచ్చితంగా గెలిచేలాగా చూడాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇన్చార్జి లను జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు టార్గెట్ పెట్టారు. నీ అనూహ్యంగా వైసీపీ మూడు చోట్ల కూడా ఓడిపోయింది దీనిమీద ఆయన చాలా ఆగ్రహం గా ఉన్నారు. ప్రత్యర్థుడికి అవకాశం ఇచ్చేలాగా ఈ ఫలితాలు వచ్చాయి అనేది జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నా రు. వైట్ 175 అంటూ సవాల్ విసుతున్న సమయంలో ఇలాంటి ఫలితాలు నష్టం కలిగిస్తాయని ఆందోళన ఉంది. దాని గురించి ఈ సమావేశంలో జగన్ ఎక్కువ ప్రస్తావిస్తారా.? అనే సందేహాలు నేతల్లో ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ అనుహంగా ఓడిపోయింది పార్టీకి అవసరమైన మంది ఎమ్మెల్యేలను పరికి నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడంతో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఎమ్మెల్యేల లో అసంతృప్తి ఉంది.. అందుకే ఇలా జరిగింది అనే ప్రచారంతో పాటు… తమతో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని టిడిపి పదే ప దే చెప్తోంది. ఇవన్నీ మూడున జరిగే సమావేశంలో జగన్ ప్రస్తావిస్తాను అంటున్నరు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభానికి ముందు.. ఆ తర్వాత మంత్రుల, ఎమ్మెల్యే లు, పార్టీ ఇంచార్జులతో సమావేశాల పెడుతు న్నారు జగన్. ఏప్రిల్ మూడు న జరిగే సమావేశంలో కూడా గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమం సమీక్ష కోసమేనా? లేక నేతలు ఊహిస్తున్నట్టు కేబినెట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి గురించి కూడా ఉంటుందా? అనేది చుడాలి.
Also Read : New Parliament: కొత్త పార్లమెంట్ అదిరింది.. ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ..