Sushmita Konidela:’రంగస్థలం’ ఒక బెంచ్‌మార్క్.. చిట్టిబాబు మేకోవర్ వెనుక అసలు కథ ఇదే: సుస్మిత కొణిదెల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sushmita Konidela:మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటనా ప్రస్థానంలో ‘రంగస్థలం’ ఒక క్లాసిక్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, చరణ్‌లోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరించిన చరణ్ సోదరి సుస్మిత కొణిదెల తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆనాటి షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. కొన్ని సినిమాలు కేవలం కలెక్షన్ల కోసమే వస్తాయి, కానీ మరికొన్ని సినిమాలు చరిత్రలో ఒక ‘బెంచ్‌మార్క్’గా నిలిచిపోతాయి. రామ్ చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ అటువంటి అరుదైన చిత్రమని సుస్మిత కొణిదెల అభిప్రాయపడ్డారు. పల్లెటూరి నేపథ్యం, 1980ల కాలం నాటి వాతావరణం, ఆ సహజత్వం.. ఇలా ప్రతి విషయంలోనూ ఈ సినిమా ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఒక స్టైలిస్ట్‌గా తనకు ఈ సినిమా ఒక పెద్ద సవాల్‌తో కూడిన ప్రయాణమని ఆమె గుర్తు చేసుకున్నారు.
READ ALSO: Bamruk-ud-Daula lake: హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధంగా మరో చెరువు.. సంతోషంలో స్థానికులు..
Also Read
- Astrology: జూలై 7 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
రామ్ చరణ్‌ను ‘చిట్టిబాబు’గా మార్చడం వెనుక జరిగిన కసరత్తు గురించి సుస్మిత వివరిస్తూ.. “చరణ్ కెరీర్‌లోనే ఇది మర్చిపోలేని మేకోవర్. గడ్డం పెంచడం నుంచి, పంచె కట్టు, ఆ బనియన్లు, ఆ కాలం నాటి రంగులు.. ప్రతిదీ చాలా సహజంగా ఉండాలని ప్లాన్ చేశాం. చిట్టిబాబు పాత్ర కోసం చేసిన ఆ క్యారెక్టరైజేషన్, మేకోవర్ కోసం పని చేయడం నాకు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది” అని చెప్పారు. చరణ్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని, ఆ రూపురేఖలు సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయని పేర్కొన్నారు. పల్లెటూరి వాతావరణంలో, ఎండలో సహజత్వానికి దగ్గరగా షూటింగ్ చేయడం ఒక సాహసమని అన్నారు. “రంగస్థలం సెట్స్ మీద ఉండటం అంటే ఒక అద్భుతమైన జర్నీ. అప్పట్లో మనం చూసిన పల్లెటూరి వాతావరణాన్ని మళ్లీ కళ్లముందు ఉంచడం కోసం టీమ్ అంతా చాలా కష్టపడింది. అలాంటి ప్రాజెక్టులు జీవితంలో ఒకసారి మాత్రమే వస్తాయి” అని అన్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ అయ్యిందని అభిప్రాయపడ్డారు. నటనలోనైనా, మేకింగ్‌లోనైనా రంగస్థలం ఒక పాఠంలాంటిదని, రామ్ చరణ్‌ను ఒక విలక్షణ నటుడిగా నిలబెట్టిన ఘనత ఈ చిత్రానిదేనని కొనియాడారు. సుస్మిత కొణిదెల మాటలు వింటుంటే, రంగస్థలం వెనుక ఎంతటి కృషి ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా చరణ్ తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ‘చిట్టిబాబు’గా మారిన తీరు, దానికి సుస్మిత అందించిన స్టైలింగ్ ఇప్పటికీ మెగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్రగా మిగిలిపోయాయి.
తాజావార్తలు
-
Astrology: జూలై 7 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!